Viral : వినూత్నంగా ఆ నేతల నిరసన..

Purushottham Vinay
ఇక ఏ రాష్ట్రంలోనైనా కాని ఎన్నికల సమయం దగ్గర పడుతుందంటే చాలు ఒకరిని ఒకరు నిందించుకుంటూ తమ ప్రత్యర్థికి సంబంధించిన లోపాలను ఎత్తి చూపిస్తూ ఉంటారు. ఇక అలాగే తమవైపు ఆకర్శించుకునే విధంగా ప్రయత్నాలు అనేవి చేస్తుంటారు.ఇక ఇలా ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లంతా గుంతలమయం కావడంతో ఆ నేతలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది.. ఇక ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకోవడం జరిగింది.ఇక దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది.ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే.. గుజరాత్‌ రాష్ట్రంలోని రోడ్లపై నీటితో నిండిన గుంతల వద్ద ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కార్యకర్తలు ఆదివారం వినూత్నంగా నిరసన తెలిపడం జరిగింది. 


ఇక వారు ఎన్నికల సమయంలో ఒక్క ఓటును కూడా రూ.500 తీసుకొని ఆ నాయకులకు అమ్ముడుపోతే ఇక ఈ రోడ్ల పరిస్థితి అనేది ఇలాగే ఉంటుందని విమర్శించడం జరిగింది. ఇక ఈ మేరకు వాళ్లు ఫ్లకార్డులను ప్రదర్శించడంతో పాటు అలాగే రోడ్లపైన నీటితో ఉన్న గుంతల వద్ద డ్యాన్స్‌ చేయడం జరిగింది.ఇక అలాగే ఈ వీడియోతోపాటు గాంధీనగర్‌లోని రెండవ వార్డులో నీట మునిగిన రోడ్ల ఫొటోలను కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం జరిగింది. ఇక అంతేకాదు.. బీజేపీ పార్టీ నేతలను కూడా వాళ్లు దృష్టిలో పెట్టుకొని గాంధీనగరల్ లోని నేతలు వినియోగించే రోడ్లు మాత్రమే బాగుండాలా లేదా మిగతా సామాన్యులు నివసించే ప్రదేశాల్లో రోడ్డు సరిగ్గా ఉండాల్సిన పని లేదా అంటూ ప్రశ్నించడం జరిగింది.ఇక ఇలా గుజరాత్ లోని గాంధీనగర్ లో వార్డు నంబర్ 2 లోని రోడ్లపైన వున్న గుంతలను వాళ్లు వీడియోలు తీస్తూ ఇంకా అలాగే నేతలను విమర్శిస్తూ వారు సోషల్ మాడియాలో పోస్టులను పెట్టడం జరిగింది. ఆప్ కార్యకర్తలు పెట్టిన ఆ పోస్టులకు అయితే కొంతమంది నెటిజన్లు స్పందించడం జరిగింది. ఆప్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఢిల్లీలో అయితే ఇలాంటి పరిస్థితి లేదా.. వాన కారణంగా గుంతలు పడటం సహజమని ఇంకా అలాగే ఢిల్లీలో కూడా ఇలాంటివి గల్లీ గల్లీలో ఉన్నాయంటూ.. వారికి రిప్లై గా అక్కడ రోడ్లపై ఇంకా ఎయిర్ పోర్టు దగ్గర వున్న గుంతలను వీడియో తీసి మరీ వీళ్లకు పెద్ద కౌంటర్ గా వీడియోలను పోస్టు చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: