వైరల్ : భూమ్మీద అత్యంత సురక్షితమైన స్మార్ట్ ఫోన్ ఇదే..!

Divya
అత్యంత సురక్షితమైన మొబైల్ అని దేనిని అంటారు.. నిజానికి వినియోగదారుడి ప్రైవసీ భద్రత విషయంలో అస్సలు రాజీపడని స్మార్ట్ ఫోన్ ను సురక్షితమైన స్మార్ట్ ఫోన్ గా పరిగణిస్తారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా స్మార్ట్ ఫోన్ లలో అత్యంత సురక్షితమైన స్మార్ట్ ఫోన్ ఏదైనా ఉంది అంటే, అది కేవలం ఆపిల్ ఐఫోన్ లేదా గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ మాత్రమే అని చెప్పవచ్చు.. అందుకే గూగుల్ పిక్సెల్ ఫోన్ లకు ఐఫోన్ లకు గిరాకి చాలా ఎక్కువగానే ఉంటుంది.. ఇతర స్మార్ట్ ఫోన్ లతో పోలిస్తే ప్రపంచంలోనే, ఈ రెండు ఫోన్లకు వినియోగదారుల ఆదరణ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.. ఇకపోతే హ్యాకర్లు ఇటీవల పెగాసస్ అనే ఒక సాఫ్ట్ వేర్ తో వీటిని కూడా హ్యాక్ చేస్తున్నారనే వార్తలు వినియోగదారులలో కలకలం రేపుతున్నాయి.. ఇలాంటి వినియోగదారుని గోప్యత భద్రత విషయంలో యాపిల్ ఐఫోన్ లలో ఐఓఎస్ ను మార్చుకోమని వినియోగదారులకు సూచించిన విషయం తెలిసిందే.

ఇకపోతే ప్రస్తుతం భూమి మీద అత్యంత సురక్షితమైన స్మార్ట్ ఫోన్ ను  ఇటీవల కనుగొనడం జరిగింది. నిజానికి ఆపిల్ గూగుల్ పిక్సెల్ ఫోన్లలో భద్రతను కూడా హ్యాకర్లు హ్యక్ చేస్తున్న తరుణంలో, ప్రతి ఒక్కరూ  భూమ్మీద అత్యంత సురక్షితమైన మొబైల్ లేనే లేదా..? అని ఆలోచిస్తున్న సమయంలోనే జర్మనీ కి చెందిన ఒక నైట్రోకీ కంపెనీ తయారు చేసినటువంటి నైట్రో ఫోన్ వన్ భూమి మీద అత్యంత సురక్షితమైన స్మార్ట్ ఫోన్ గా గుర్తింపు చెందింది. దీనిని ఇటీవల 9టూ5 గూగుల్ నివేదించింది అని సమాచారం.

వినియోగదారుల రహస్యాలను గోప్యంగా ఉంచడం కోసమే ఈ నైట్రో ఫోన్లు తయారు చేశారట. ఇక ముఖ్యంగా ఈ ఫోన్ తయారు చేసేటప్పుడు గూగుల్ పిక్సెల్ 4a లో ఉన్న హార్డ్వేర్ పార్ట్ ను తీసివేసి , ఇతర హార్డ్ వేర్  తో రీప్లేస్ చేశారని సమాచారం. అంతే కాదు ఇందులో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కి బదులుగా గ్రాఫ్రేనియన్ ఓ ఎస్ ఆపరేటింగ్ సిస్టం ను పొందుపరిచారు. ఇక దీని యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ,గూగుల్ కు సంబంధించిన ఎటువంటి యాప్ లను కూడా మనం ఈ నైట్రో ఫోన్లో చూడలేము. ముఖ్యంగా గూగుల్ మ్యాప్స్ , గూగుల్ ఫొటోస్ వంటి యాప్స్ కు యాక్సిస్ ఉండదు. ఇకపోతే భారత మార్కెట్ ప్రకారం దీని ధర 54629 రూపాయలు గా పరిగణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: