ఎంటి బంగారాన్ని ఇలా కూడా వాడుతారా?

Dabbeda Mohan Babu
ఈ రోజుల‌లో మ‌నుషుల‌కు వేరైటీ అనే భుతం ప‌ట్టుకుంది. ఏది చేసినా ఎలా చేసినా త‌న‌కు ఓ ప్ర‌త్యేక‌త ఉండాల‌ని అనుకుంటున్నారు. ముఖ్యంగా యువ‌త ఈ వేరైటీ ని ప‌ట్టుకుని వ్రేలాడుతున్నారు. వారు వేసుకుని బ‌ట్టల నుంచి ప్ర‌తి విష‌యంలో వేరైటీ ఉండాల‌ని చూస్తున్నారు. దాని కోసం ఎంత దూర‌మైన స‌రే వెళ్తున్నారు. అంతా కాకుండా కొంత మంది శ‌స్ర చికిత్సలు కూడా చేసుకుంటున్నారు. ఈ విష‌యంలో సామ‌న్యూ ల‌తో ఏ మాత్రం తీసిపొకుండా సెల‌బ్రేటీలు సైతం ముందు ఉన్నారు. ఓ సెల‌బ్రేటీ అయితే ఏకంగా త‌న త‌ల‌కు శ‌స్ర చికిత్స చేసుకుని హుక్స్ పెట్టుకున్నాడు. హుక్స్ పెట్టు కుంటే ఎం ప్ర‌త్యేక‌త ఉంది అనుకుంటున్నారు. కేవలం హుక్సే కాదండోయ్. ఆ హుక్స్ ల‌కు బంగారు తీగ‌ల‌ను త‌గిలించుకున్నాడు. అవి త‌న‌కు బంగారు వెంట్రుక‌లు అని ఆ సెల‌బ్రేటీ అంటున్నాడు.

బంగారాన్ని ఎవ‌రైనా ఉంగారాలు, బ్ర‌స్‌లైట్ లు, చైన్ లు చేసుకుంటారు. కానీ వెంట్రుక‌లు చేసుకుంటారా అని అనుకుంటున్నారు క‌దు. అవును నిజ‌మండి బాబు. మెక్సికో దేశానికి చెందిన 23 ఏళ్ల డాన్ సుర్ అనే ర్యాప‌ర్ బంగారంతో గోలుసులు చేసుకుని తల‌పై వెంట్రుక‌ల‌ల‌గా పెట్టుకున్నాడు. ఈ విష‌యాన్ని తానే సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. త‌న బంగారు వెంట్రుక‌ల ఫోటోను సైతం అభిమానుల‌తో పంచుకున్నాడు. ఎంతో మంది ర్యాప‌ర్లు జుట్టుకు రంగు వేసుకోవ‌డం చూస‌ను.. ఎవ‌రూ త‌న‌ను కాఫీ కొట్ట‌కుండా కాస్త వేరైటీ గా ఉండాల‌ని అనుకున్నాను అని అన్నారు. అందు కోస‌మే త‌ల హుక్స్ పెట్టుకుని బంగారు వెంట్రుక‌ల‌ను చేసుకున్నాని అన్నాడు.

ఈ కొత్త లుక్ తన కేరీర్ ప‌రంగా చాలా ఉప‌యోగ ప‌డుతుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. ప్ర‌స్తుతం ఈ ర్యాప‌ర్ బంగారు వెంట్రుక‌ల ఫోటోలు, వీడియోలు నెట్టింట వైర‌ల్ గా ఉన్నాయి. కాగ ఈ ర్యాప‌ర్ డాన్ సుర్ గ‌తంలోనూ ఇలాంటి వేరైటీ ప‌నులు చేసి వార్త‌ల్లో హైలైట్ గా నిలిచారు. గ‌తంలో డాన్ సుర్ త‌న దంతాల‌కు బంగారంతో కూడిన తొడుగుల‌ను వేయించుకున్నాడు. అప్పుడు కూడా ఆ ఫోటోలు వైర‌ల్ గా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: