ఇదేమి పెళ్లి? బహుమతుల రేటును బట్టి విందట!

Purushottham Vinay
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం మనిషికి జీవితంలో పెళ్లి అనేది లేకపోతే ఇక ఆ జీవితానికి ఎలాంటి అర్ధం లేదు. ఇక పెళ్లిళ్లు ఎప్పుడూ కూడా స్వర్గంలో నిర్ణయించబడతాయి అని మన పెద్దలు అంటారు. ఇక ఆ పెళ్ళికి వధూవరుల కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు అలాగే ఇంకా స్నేహితులతో పాటు ఎంతో మంది వచ్చి ఆశీర్వాదాలు అందించి ఇంకా అలాగే పెళ్లి విందును కూడా ఆరగించి వెళ్ళి పోతారు. ఇక అందులో కొందరు మనస్పూర్తిగా విందును ఆరగిస్తే, మరికొందరు అయితే మాత్రం ఏదో ఒక వంక పెట్టక మానేస్తారు. ఇక ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే తాజాగా ఒక నవవధువు ఇంకా వరుడు చేసిన వింత పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ చక్కర్లు కొడుతోంది.పెళ్లి అనేది వధువు అలాగే వరుడి జీవితంలో అత్యంత ముఖ్యమైన మధురానుభూతులలో ఒకటని చెప్పాలి.

ఇక అది జీవితాంతం అందరికి గుర్తుండిపోయేలా చేయడానికి ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు నేటి మన యువత. అయితే ఈ కొత్త వధువు ఇంకా వరుడు మాత్రం సరికొత్త మార్గాన్ని ఎన్నుకున్నారు.ఇక తమ పెళ్ళికి విచ్చేసిన అతిథుల కోసం ముందుగానే ఒక నోట్‌ను విడుదల చేయడం జరిగింది.ఇక అందులో అతిథులు తెచ్చే బహుమతుల రేటు ప్రకారం పెళ్లిలో ఎలాంటి విందును స్వీకరించాలో నిర్ణయించడం జరిగింది.ఇక ఇదేదో బాగుంది కదా అనుకున్నారో ఏమో ఈ నోట్ ఫోటోకు సోషల్ మీడియాలో ఎక్కువగానే లైకులు వస్తున్నాయి. ఇక నెటిజన్లు ఈ నోట్ ను తెగ షేర్ చేస్తూ బాగా వైరల్ చేస్తున్నారు. మరి పెళ్ళిలో నిజంగానే ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారా? అని కొంతమంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.ఇక ఏదేమైనా ఈ కొత్త జంట మొత్తానికి వార్తల్లో నిలివడం జరిగింది. ఇక ఈ పద్ధతిని ఎవరైనా నిజంగా ఫాలో అయినా కాని ఆశ్చర్యపోనవసరం లేదేమో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: