ఈ జంట పెళ్లి ఎలా చేసుకుందో తెలుసా?

Dabbeda Mohan Babu
ఈ రోజుల్లో యువ‌త పెళ్లి పై ఎన్నో క‌లలు కంటున్నారు. ఎలాంటి అమ్మాయిని చేసుకోవాల‌ని, ఎలా చేసుకోవాల‌ని తెగ ఆలోచిస్తున్నారు. త‌మ‌ పెళ్లిని అంద‌రి కంటే కాస్త భిన్నంగా చేసుకోవాల‌ని కోరుకుంటున్నారు. నేటి యువ‌త ధ‌రించే ద‌స్తుల నుంచి అన్నింటిలో నూ వేరైటీని కోరుకుంటున్నారు. ఏదైన విభిన్నంగా చేసి వార్త‌ల్లో ఎక్క‌లాని, వైర‌ల్ కావాల‌ని అనుకుంటున్నారు. మొబైల్ ఫోన్స్ వ‌చ్చాక తాము ఎం చేసినా ప్ర‌పంచం మొత్తం తెలియాల‌ని కొరుకుంటున్నారు. అలాగే త‌మ మ్యారేజ్ ను అంద‌రూ చూడాల‌ని, ప్ర‌పంచం మొత్తం త‌మ పెళ్లి గురించి మాట్లాడుకోవాల‌ని చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ మ‌ధ్య పెళ్లి ల‌లో పాటల‌కు వ‌ధువు, వ‌రుడు డాన్స్ చేస్తూ వైర‌ల్ అవుతున్నారు. అలా కొంత‌మంది త‌మ పెళ్లి ల‌ను విమానంలో, రైల్ లో, ప‌డ‌వ‌లో చేసుకుని ప్ర‌పంచ దృష్టిని త‌మ వైపున‌కు ఆక‌ర్షించాకున్నారు. ఒక ధైర్య సాహాసాలు చేసే జంట స్కై డ్రైవ్ చేసుకుంటూ త‌మ పెళ్లిని చేసుకున్నారు. కానీ ఈ జంట త‌మ మ్యారేజ్‌ను ఎలా చేసుకుందో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.

ఈ జంట ఇంక కాస్త భిన్నంగా ఆలోచించారు. త‌మ పెళ్లి వేధిక‌ను నీటి గా ఎంచుకున్నారు. అలా వీరు అండ‌ర్ వాట‌ర్ మ్యారేజ్ ను ప్లాన్ చేశారు. మ్యారేజ్ ఇన్ హెవెన్ అన్న‌ట్టు మ్యారేజ్ ఇన్ అండ‌ర్ వాట‌ర్ లా వీరి పెళ్లి జ‌రిగింది.  ఈ అండ‌ర్ వాట‌ర్ పెళ్లి నెట్టింట వైర‌ల్‌గా మారింది. ట్విట్ట‌ర్ లో చాలా మంది ఆ విడియోను షేర్ చేస్తున్నారు. ఈ పెళ్లి ఇంగ్లాండ్‌లోని బ‌ర్మింగ్ హోం ల‌నో బేర్‌గ్రిల్స్ అడ్వెంచ‌ర్ సెంట‌ర్ లో జరిగింది. ఈ కొత్త జంట కు స్కూబా డైవింగ్ అంటే చాలా ఇష్టమంటా. దానిపైనే ప్రేమ‌తో ఇలా త‌మ వివాహాన్ని చేసుకున్నార‌ని తెలుసుస్తోంది. వారి పెళ్లి వీడియో వైర‌ల్ అవ‌డం అంద‌రూ దీన్ని లైక్ చేయ‌డంతో ఈ కొత్త జంట తెగ సంతోష‌ప‌డిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: