ఇలాంటి సైనికుడికి సరిలేరు ఎవ్వరూ..
ఇక ఇద్దరు యువతుల తండ్రి, ఐదుగురు సభ్యుల కుటుంబాన్ని తరలింపు విమానంలో గుర్తించారు.ఇందులో తల్లిదండ్రులు ఇంకా వారి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాబూల్ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత వారు విమానంలో ఎక్కారు. అప్పుడు అనేక మంది మరణించారు.ఇక లివింగ్‌స్టోన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "వారంతా అలసిపోయారు. "అప్పుడు, నా కంటి మూలలో నేలపై ఏదో పడిపోవడం నేను చూశాను.ఆ మహిళ తన రెండు వారాల బిడ్డను ఎత్తుకుంది.ఇక ఆ సమయంలో, ఆమె బాగా అలసి పోవడంతో నేను ఆ బిడ్డను కాసేపు చూసుకున్నాను. దాదాపు ఒక గంట వరకు నేను నా బిడ్డగా లేదా నా స్నేహితులలో ఒకరిగా అక్కడే ఉండి ఆ బిడ్డని చూసుకున్నాను" అని అతను చెప్పాడు.ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఇక అందరూ కూడా ఆ సైనికుడిని సరిలేరు నీకెవ్వరూ అంటూ కొనియాడుతున్నారు.నిజంగా అలాంటి సైనికుడు ప్రతి దేశానికి వుండాలని నెటిజెన్స్ కోరుకుంటున్నారు.