వైరల్ :కొత్త ఆఫ్ఘన్ ప్రభుత్వ చట్టాలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

Divya
గత ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని తాలిబన్ యోధులు దాడిచేసి, మంగళవారం ఏడవ తేదీ సెప్టెంబర్ నెల 2021 సంవత్సరం కొత్త ప్రభుత్వాన్ని తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త ఆఫ్ఘన్ ప్రభుత్వానికి అధిపతిగా ముల్లా మొహమ్మద్ హాసన్ హఖూండ్ నియమితులయ్యారు.. ఇకపోతే వీరు సరికొత్త చట్టాలను సవరించడం జరిగింది. ప్రకటనలో తాలిబన్ సుప్రీమ్ లీడర్ గా గుర్తింపు పొందిన హిబతుల్లా అఖుంజాదా ప్రభుత్వం యొక్క మొదటి ప్రకటనను జారీ చేశారు. దేశ ప్రజల యొక్క షరియా చట్టాన్ని తమ ప్రభుత్వం సమర్థిస్తూ ఉందని , మానవ హక్కులను కాపాడుతుందని అలాగే అంతర్జాతీయ హక్కులను గౌరవిస్తుందని చెప్పారు..

తాలిబన్ల యొక్క కొత్త పాలన అన్ని అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాలు, తీర్మానాలు అలాగే కట్టుబాట్లకు కట్టుబడి ఉంటుందని, ఇస్లామిక్ చట్టాలు ..ఆఫ్ఘనిస్తాన్ జాతీయ విలువలతో ఎప్పుడు విభజించవద్దని ప్రకటన చేయడం జరిగింది. మైనారిటీ హక్కులు, మానవ హక్కుల తోపాటు ఇస్లాం యొక్క అట్టడుగు వర్గాల హక్కుల ను కాపాడేందుకు సకల ప్రయత్నాలు చేస్తామని, సమర్థవంతమైన చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది..
షరియా చట్టం కింద తాలిబన్ , ఆఫ్ఘన్ జాతీయులకు మతపరమైన అలాగే ఆధునిక శాస్త్రాలకు సంబంధించిన అన్ని విషయాలను సురక్షితంగా కాపాడతామని చెప్పారు.  మీడియా నాణ్యతను మెరుగు పరచడంతో పాటు వారికి పూర్తి స్వేచ్ఛను, పనితీరును కలుగ చేస్తామని కూడా తెలిపారు. ఇక ఇస్లాం మతం యొక్క పవిత్ర సూత్రాలను, దేశ జాతీయ ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. కుల ,మత ,వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికీ సమానమైన న్యాయం చేకూరుస్తామని కొత్త ఆఫ్గాన్ ప్రభుత్వం వెల్లడించింది.

అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ నుండి దేశ భద్రతకు వ్యతిరేకంగా ఎటువంటి ఆయుధాలను ఉపయోగించమని వారు తెలిపారు. దేశాన్ని శాంతియుతంగా, సుసంపన్నంగా, స్వయం ఆధారిత ఆఫ్ఘనిస్తాన్ గా మార్చుకోవాలి అన్నది తమ ధ్యేయమని అందుకోసం ఎటువంటి కృషి చేయాలన్న చేస్తాము అని దేశ ప్రజల కోసం పూర్తి భద్రత సౌకర్యాలను కల్పిస్తామని వారు తెలపడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: