నగరాల్లో డ్రగ్స్ వలలో చిక్కుకున్న యువత..చివరికి..?

Divya
డ్రగ్స్.. అత్యంత ప్రమాదకరమైన మత్తుపదార్థం.. దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద పెద్ద నగరాల్లో వాణిజ్యపరంగా ధనికులు గా పేరు పొందిన వారి పిల్లలు కూడా, ఈ డ్రగ్స్ వ్యవహారంలో మునిగితేలుతున్నారు. మత్తులో ఏం చేస్తున్నారో తెలియక ,ఈ ఒక్కరోజు డ్రగ్స్ లేకపోయినా జీవించలేము అన్నంతగా మారిపోయి సూసైడ్ చేసుకున్న పరిస్థితులను కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ ధనవంతుల, పిల్లలతో స్నేహం చేసే సామాన్య యువత కూడా డ్రగ్స్ కు అలవాటు పడిపోయి వేలకు వేలు ఖర్చు పెట్టి మత్తు మందుకు బానిస అవుతున్నారు..

ఈ మత్తు పదార్థానికి బానిస అవ్వడం వల్ల జీవితాన్ని కోల్పోవడంతో పాటు కుటుంబానికి కూడా తీరని కష్టాన్ని మిగులుస్తున్నారు. ముఖ్యంగా 2014 సంవత్సరంలో తెలంగాణలో బయటకు వచ్చిన ఈ డ్రగ్స్ వ్యవహారం, ఇప్పటికీ చర్చనీయాంశంగా మారింది.. మిగతా రాష్ట్రాల పరిస్థితిని పక్కన పెడితే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో కూడా పెద్ద పెద్ద కాలేజీలలో ధనికుల పిల్లలు రహస్యంగా, ఈ డ్రగ్స్ ను తీసుకుంటున్నారనే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ డ్రగ్స్ కు భయపడిన ఎంతో మంది తల్లిదండ్రులు కూడా, తమ  పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే పెద్ద పెద్ద కళాశాలలో చేర్పించాలి అంటేనే భయపడుతున్నారు.

అభం శుభం తెలియని యువత ..బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయాల్సింది పోయి డ్రగ్స్ మహమ్మారి బారిన పడి, తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దేశ అభివృద్ధికి పాటుపడే ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు , డాక్టర్లు ఇలా ఏవేవో కావాల్సిన వీరంతా, ఇలా డ్రగ్స్ కు బానిస అయ్యి ఎంతో మంది జీవితాలను కూడా నాశనం చేస్తున్నారని చెప్పాలి. ముఖ్యంగా విదేశాల నుంచి మన దేశానికి వచ్చిన ఈ డ్రగ్స్ వ్యవహారం, ఇటీవల చాలామంది పిల్లలపై తీవ్ర నష్టాన్ని చూపిస్తోంది. ఇక యువతతో పాటు ఇటీవల చిన్న పిల్లలు కూడా ఈ డ్రగ్స్ కు బానిస అవుతున్నారని తెలుస్తోంది. ధూమపానం, మద్య పానం కంటే అత్యంత ప్రమాదకరమైన ఈ మత్తు నుంచి యువతను కాపాడేదెవరు.. భవిష్యత్తు ని చక్కగా తీర్చిదిద్దేది ఎవరో ఆ పరమాత్ముడి కే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: