తాలిబన్ నుంచి తప్పించుకున్నారు.. భారత్ కాపాడింది..!

Divya
దాదాపు 25 సంవత్సరాల తర్వాత తాలిబన్లు తమ అధికారాన్ని చేజిక్కిచ్చు కున్నామనే ఎంతో గర్వ పడుతున్న విషయం తెలిసిందే.. ఈ తాలిబన్ల దాడికి తట్టుకోలేక ఎంతోమంది ఆఫ్ఘనిస్తాన్ నుండి వదిలి ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రాణాలను కాపాడుకుంటున్నారు.. ఇక ఆఫ్ఘనిస్తాన్ పైన ఉన్న మమకారంతో మరికొంతమంది అక్కడి నుండి వెళ్లలేక ఆకృత్యాలకు తట్టుకోలేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించిన ఒక కుటుంబం భారతదేశంలోని వెస్ట్ బెంగాల్ కొచ్చి తల దాచుకోవడంతో అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.

మహమ్మద్ ఖాన్ అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలతో.. ఒకరు 8 సంవత్సరాల మలాలా కాగా మరొకరు తొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన పాస్తానా.. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి పశ్చిమబెంగాల్లో హౌరా లో ఒక కొత్త ఇంటిని తీసుకొని, అక్కడ నివసిస్తున్నారు. పొరుగు రాష్ట్రం వారు మద్దతు ఇవ్వడంతో అందరూ మెచ్చుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కోల్ కత్తాకు సుమారుగా రెండు వారాలు ప్రయాణం తర్వాత ,ఈ కుటుంబం పశ్చిమబెంగాల్లో ఆశ్రయం పొందుతోంది. వీరు తమ కొత్త జీవితాలను కూడా ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఇకపోతే కాబూల్ లో ఉన్న తన ఇల్లు ,షాపు, ఆదాయవనరులు అన్నీ కూడా తాలిబన్ యోధులు లాగేసుకోవడంతో నిరాశ్రయులైన మొహమ్మద్ ఖాన్ కొత్తగా తన జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాడట.. మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. రెండు మూడు వారాల కిందట నా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. పిల్లలు కూడా తిండి పెట్టలేక అల్లాడిపోయారు ..కానీ ఎట్టకేలకు భారతదేశానికి చేరుకున్నాను. ఇప్పుడు నాకు ఇక్కడ మంచి స్నేహితులు ఉన్నారు.. అందరూ నాకు చాలా బాగా సహాయం చేస్తున్నారు.. భారతీయులు కూడా మా ఇంటికి వచ్చారు. వీరు చేస్తున్న  సహాయం  నేను ఎప్పటికీ మర్చిపోలేను.. అని తెలిపాడు.
అంతేకాదు ఆ దేశంలో తన ఇంటి ముందే నలుగురిని తాలిబన్ యోధులు చంపడంతో తన భార్య తీవ్ర అస్వస్థతకు గురి అయిందని, రక్తం మడుగులో ఉన్నవారిని చూసి తట్టుకోలేక స్పృహ కోల్పోయింది. ప్రస్తుతం కోలుకుంటోందని ఆయన తెలిపాడు. ఇక అంతే కాదు వారి పిల్లలు కూడా ఇరుగుపొరుగు పిల్లలతో చాలా సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: