కరోనా నిబంధనలను ఉల్లంగించినందుకు జైలు శిక్ష..

Purushottham Vinay
కరోనా మహమ్మారి ఎంత దారుణమైన ఇంకా భయంకరమైన వైరస్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ వైరస్ ప్రపంచ స్థితిని పూర్తిగా మార్చేసింది. కంటికి కనిపించని ఈ చిన్న వైరస్ పెద్ద కల్లోలాన్ని సృష్టించింది. ప్రభుత్వాలు అన్ని కూడా అప్రమత్తమై అందరికీ ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కాని వాటిని పెడచెవిన పెట్టినవారు ఇంకా పెడుతూనే వచ్చారు. ఇక ఇంత విధ్వంసం తరువాత కూడా ఇప్పటికీ కరోనా నిబంధనలు పాటించడం అంటే కొందరు ఇప్పటికి కూడా నిర్లక్ష్యం వహిస్తూనే వస్తున్నారు. ఎక్కువగా ఇప్పటికీ కూడా కొంతమంది మాస్క్ లు పెట్టుకోకుండా రోడ్లపై తిరిగేస్తున్న వారిని మనం రోజు చూస్తూనే ఉన్నాం. మాస్క్ కనుక పెట్టుకోకపోతే 500, 1000 రూపాయల జరిమానా అని కొన్ని ప్రభుత్వాలు ప్రజలకు హెచ్చరించినా కాని వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా తిరిగేస్తున్న వైనం కూడా మనకి తెలిసిందే.
ఇక అటువంటి వారి కోసమే ఈ వార్త. కరోనా నిబంధనలు పాటించనందుకు ఒక వ్యక్తికి ఏకంగా 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. అది ఎక్కడో ఇప్పుడు తెలుసుకోండి.కఠినమైన కరోనా మహమ్మారి నిర్బంధ నియమాలను ఉల్లంఘించినందుకు గాను అతని పరిచయాల మధ్య వైరస్ వ్యాప్తి చేసినందుకు గాను ఒక వ్యక్తికి వియత్నాం దేశంలో ఏకంగా ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది.వియత్నాం దేశం నుండి వచ్చిన సమాచారం ప్రకారం, ఆ దేశానికి చెందిన లె వాన్ ట్రై (28) అనే వ్యక్తికి ప్రజా కోర్టులో విచారణ తర్వాత ప్రమాదకరమైన అంటు వ్యాధులను వ్యాప్తి చేసినందుకు గాను దోషిగా తేలడం జరిగింది.దీంతో అతనికి అక్కడ శిక్ష విధించడం జరిగింది.ఇక అక్కడ ఇతని ఒక్కడికే కాదు ఇలాంటి ఆరోపణలపైన ఆ దేశంలో మరో ఇద్దరు వ్యక్తులకు కూడా 18 నెలల అలాగే రెండు సంవత్సరాల సస్పెండ్ జైలు శిక్షని విధించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: