వైరల్ : వాడిన మాస్కులతో పెండ్లి గౌను..చివరికి..?

Suma Kallamadi

ప్రపంచమంతా కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. వ్యాక్సిన్ వేసుకున్నా సరే మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్ చేతులకు రాసుకోవడం ప్రస్తుత కాలంలో సాధారణం అయిపోయింది. అయితే మాస్కులను వాడి పడేయడం వల్ల పర్యావరణానికి చాలా ముప్పు పొంచి ఉందని పర్యావరణ విశ్లేషకులు పేర్కొన్నారు. ఒక్కసారి ఉపయోగించి పడేసే మాస్కుల వల్ల పర్యావరణం కాలుష్యం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొందరు వీటిని వివిధ రకాలుగా అవసరాలకు ఉపయోగిస్తూ పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి కొంత వరకైనా కృషి చేస్తున్నారు. కొందరు మాస్కులతో రోడ్డు వేస్తుండగా, తాజాగా కొందరు వాడి పడేసిన మాస్కులతో పెళ్లి డ్రెస్ తయారు చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌కు చెందిన ప్రముఖ డ్రెస్ డిజైనర్ టామ్ సిల్వర్ వుడ్ వాడి పడేసిన ఫేస్ మాస్కుల సాయంతో ఏదైన కొత్తగా రూపొందించాలని ఆలోచించింది. అనుకున్నదే తడవుగా, ఈ మాస్కుల సహాయంతో వెడ్డింగ్ డ్రెస్ తయారు చేయాలని అనుకుంది. దీని కోసం ప్రఖ్యాత వెడ్డింగ్ ప్లానర్ అయిన హిచ్డ్ ఫైనాన్షియల్‌గా ఆమెకు సహాయ సహకారాలను చేసింది. ఈ విధంగా ఆమె వాడి పడేసిన 1500 మాస్కులను ఉపయోగించి చాలా అందమైన మహిళల పెళ్లి డ్రెస్‌ను తయారు చేసింది. అంతే కాకుండా ఈ పెళ్లి డ్రెస్‌ను ప్రముఖ మోడల్ జెమిమా హాంబ్రో వేసుకుని, లండన్ నగరంలోని సెయింట్ పాల్స్ క్యాథెడ్రల్ ముందు ఫోటో షూట్ చేయడంతో డ్రెస్ చాలా పాపులర్ అయింది. కరోనా నియంత్రించడానికి ప్రతి రోజూ మాస్క్ పెట్టుకోవడం తప్పనిసరి కానీ, వాడి పడేసే మాస్కుల కంటే మళ్లీ ఉతికి తిరిగి ఉపయోగించే మాస్కులను వాడటం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని సిల్వర్ ఉడ్ తెలిపింది. ఈ విధంగా ప్రజలకు వాడి పడేసే మాస్కుల వల్ల కలిగే పర్యావరణ కాలుష్యం గురించి తెలియజేయడానికే ఇలా చేశానని డిజైనర్ టామ్ సిల్వర్ ఉడ్ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: