విద్యార్థి కోసం బార్బర్ అవతారమెత్తిన ప్రిన్సిపాల్..?

sravani
సాధారణంగా స్కూల్లో విద్యార్థులు నిబంధనలు అతిక్రమిస్తే టీచర్ లేదా ప్రిన్సిపాల్ వారిని దండిస్తారు. అప్పటికీ మాట వినకపోతే భజన దెబ్బ వేస్తారు. లేదంటే వార్నింగ్ ఇస్తారు. అలా చెబితే అన్నా పిల్లలు వింటారు అని అనుకుంటారు. అయితే పిల్లలను సరైన క్రమశిక్షణలో పెట్టే బాధ్యత ప్రిన్సిపల్ లేదా టీచర్ ది. విద్యాబుద్ధులు కాదు విద్యార్థి మనసును చదివి వారి ఇష్టాయిష్టాలను  తెలుసుకోవడం కూడా గురువుల కర్తవ్యమే ఈ ప్రిన్సిపల్ తెలియజేశారు. ఒక విద్యార్థి కోసం ఒక ప్రిన్సిపాల్ బార్బర్ అవతారం ఎత్తాడు. ఈ విషయం గురించి మనం తెలుసుకుందాం.

అమెరికాలోని ఇండియానాకు చెందిన ఆంథోనీ మూరే అనే విద్యార్థిని స్టోనీ బ్రూక్‌ ఇంటర్మిడియెట్ అండ్‌ మిడిల్‌ స్కూల్లో చదువుతున్నాడు. ఇటీవల అతడు క్యాప్ పెట్టుకుని స్కూలుకు రావడాన్ని ఆ స్కూల్ డీన్ చూశాడు. స్కూల్ నిబంధనల ప్రకారం విద్యార్థి క్యాప్ పెట్టుకుని రావడం డ్రెస్‌కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తుందని, వెంటనే క్యాప్ తీసేయాలని తెలిపాడు. అయితే, మూరే మాత్రం ఆ క్యాప్ ఎట్టిపరిస్థితిలో తీయనని చెప్పాడు. సుమారు అరగంట సేపు డీన్‌తో వాదించాడు. దీంతో ఆయన ప్రిన్సిపల్ జాసన్ స్మిత్‌కు ఈ విషయం చెప్పారు. డీనో రూమ్‌లోకి వచ్చిన ప్రిన్సిపల్ ఆ పిల్లాడికి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వలేదు. పైగా అతడి సమస్యను అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించాడు. ‘‘ఎందుకు నువ్వు టోపీ పెట్టుకుంటున్నావు? కారణం ఏమిటీ?’’ అని బ్రూక్‌ను అడిగారు. ఈ సందర్భంగా బ్రూక్ మాట్లాడుతూ ‘‘నాన్న నన్ను హెయిర్‌కట్‌కు తీసుకెళ్లాడు. కానీ, అది నాకు నచ్చలేదు. అందుకే క్యాప్ పెట్టుకున్నా’’ అని తెలిపారు .

దీంతో టోపీ తిసి హెయిర్ స్టైల్ చూచించాలని మూరేను అడిగారు.మూరే హెయిర్ స్టైల్ చూసిన డీన్‌లు బాగానే ఉందిగా? ఎందుకు బాధపడుతున్నాడని అన్నారు. దీంతో ప్రిన్సిపల్ స్మిత్ స్పందిస్తూ చూడండి 13 లేదా 14 ఏల్ల పిల్లలకు తల్లిదండ్రులు చెప్పేది అంగీకరించరు. సమాజానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అంటే, ఇంట్లోవారికి నచ్చినది  బయటవారికి నచ్చకపోచ్చని అనుకుంటారు అని డీన్‌కు తెలిపాడు. అనంతరం మూరేతో మాట్లాడుతూ  ‘‘నేను నీ అంత వయస్సు ఉన్నప్పటి నుంచి హెయిర్ కట్ చేస్తున్నా.నా కొడుకుకు కూడా నేనే హెయిర్ కట్ చేస్తా’’ అంటూ ఆయన మొబైల్‌లో కొడుకు ఫొటోలు చూపించాడు.నేను ఇంటికి వెళ్లి నీ హెయిర్ స్టైల్‌ను అందంగా మార్చే వస్తువులను తీసుకుని వస్తాను. హెయిర్ కట్ తర్వాత తిరిగికి క్లాస్‌కు వెళ్తావా?’’ అని మురేను ప్రిన్సిపల్ స్మిత్ అడిగాడు. ఇందుకు అతడు అంగీకరించాడు.

దీంతో స్మిత్ తన ఇంటికి వెళ్లి ట్రిమ్మర్ తీసుకుని స్కూల్‌కు వచ్చాడు. మురే తల్లిదండ్రులకు కాల్ చేసి జరిగినది చెప్పి, హెయిర్ కట్ చేసేందుకు అనుమతి తీసుకున్నాడు. ఆ తర్వాత మూరే జుట్టును అందంగా కత్తిరించాడు. అద్దంలో తనని తాను చూసుకుని మురిసిపోయిన మురే ఆత్మవిశ్వాసంతో క్లాస్‌రూమ్‌కు వెళ్లాడు. తన జుట్టు గురించి ఆలోచించకుండా బుద్ధిగా టీచర్ చెబుతున్న పాఠాలు విన్నాడు.ఈ విషయం తెలిసి మురే తల్లిదండ్రులు సంబరపడిపోయారు. తన కొడుకుని స్కూల్ నుంచి పంపేయకుండా పరిస్థితిని చాలా చక్కగా సరిదిద్దారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఆ బుడ్డోడు గట్టోడే కదూ. ఏకంగా ప్రిన్సిపల్‌తోనే హెయిర్ కట్ చేయించుకున్నాడు. పిల్లల మనసు చదివిన గురువులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు. వారిలో ఈ ప్రిన్సిపల్ స్మిత్ ఎంతో ప్రత్యేకం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: