వణుకు పుట్టిస్తున్న వీడియో.. రెప్పపాటులో కారు మాయం?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచ నలుమూలలో ఎక్కడ ఏం జరిగినా కూడా తెలుసుకోవడం .. మనిషికి ఎంతో సులభతరంగా మారిపోయింది అని చెప్పాలి. అరచేతిలో ఉన్న ఆరు అంగుళాల స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ ఇస్తే సరిపోతుంది. ఇక ఎక్కడో జరిగిన ఘటనలు కూడా కళ్ళ ముందు వాలిపోతున్నాయని చెప్పాలి. ఇలా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. మరికొన్ని ఘటనలు అందరిని భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ట్విట్టర్ వేదిక వైరల్ గా మారిపోయింది.

 ఒక టోర్నడో సృష్టించిన విధ్వంసం ఈ వీడియోలో చూడవచ్చు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత నెటిజెన్స్ వారి కళ్ళను వారే నమ్మలేకపోతున్నారు అని చెప్పాలి. అక్కడ ఏం జరిగింది అన్నది కూడా కాసేపటి వరకు నేటిజన్స్ కి అర్థం కావడం లేదు. దీంతో వీడియోని రిపీట్ చేసి మరీ చూస్తూ ఉన్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సాధారణంగా గట్టిగా ఈదురు గాలులు వీస్తేనే అందరూ భయపడిపోతూ ఉంటారు. అలాంటిది ఇక తుఫాను వస్తే ఇంట్లో కూర్చుని ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు టోర్నడోలు మాత్రం అంతకుమించి అనే రేంజ్ లోనే విద్వాంసాన్ని సృష్టిస్తూ ఉంటాయి అని చెప్పాలి.

 ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా ఒక టోర్నడో సినిమాల రేంజ్ లో ఒక కారును అమాంతం గాల్లోకి లేపుకుపోయింది అని చెప్పాలి. దీంతో అక్కడ జరిగిన విషయాన్ని ప్రత్యక్ష సాక్షులు కూడా నమ్మలేకపోయారు. ఈ వీడియోలో ఎప్పటిలాగానే రోడ్డుపై కార్లు ప్రయాణిస్తూ ఉన్నాయి. మరోవైపు చిరుజల్లులు కురుస్తున్నాయి. అలాంటి సమయంలోనే ఒక్కసారిగా దూసుకు వచ్చిన టోర్నడో కారు పై తన ప్రతాపాన్ని చూపించిందని చెప్పాలి. అమాంతం కారును చుట్టేసి ఇక ఒక భారీ జంతువు మనిషిని మింగేసినట్లుగానే.. కారును మింగేసింది టోర్నడో. సెకండ్ల వ్యవధిలోనే కారు సహా రోడ్డుపై ఉన్న అన్ని మాయమైపోయాయి. ఈ వీడియో ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: