ఘోర రోడ్డు ప్రమాదం.. రెప్పపాటులో తప్పించుకున్నాడుగా?

praveen
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కానీ ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. అయితే అటు వాహనదారులందరూ కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ పోలీసులు ఎంత మొత్తుకున్నా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తున్నవారు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటే ఇంకా ఎంతో మంది తీవ్ర గాయాలపాలై జీవచ్ఛావాలుగా మారిపోతున్నారు. అదే సమయంలో మరికొంతమంది ఏకంగా ప్రాణాలు పోయే ప్రమాదాల నుంచి కూడా రెప్పపాటు కాలంలో తప్పించుకుంటూ ఉండటం లాంటివి జరుగుతూ ఉన్నాయి.

 ఇక ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోకి వస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చి హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒక బైక్ రైడర్ నిర్లక్ష్యంగా వాహనం నడపడం కారణంగా చివరికి ప్రాణాలు పోయే పరిస్థితిని కొని తెచ్చుకున్నాడు.. ఏకంగా బైక్ నడుపుతూ వేగంగా దూసుకు వస్తున్న ఒక భారీ ట్రక్కుకు ఎదురు వెళ్ళాడు. కానీ అదృష్టం బాగుండి రెప్పపాటు కాలంలో అతను ప్రాణాలతో బయటపడగలిగాడు అని చెప్పాలి.

 ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారి పోయింది. ఈ వీడియో లో చూసుకుంటే.. ఒకవైపు నుంచి భారీ ట్రక్ వేగంగా దూసుకు వస్తుంది.. ఇలాంటి సమయంలోనే ఇక మరో రోడ్డు నుంచి ఏకంగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ వచ్చిన వాహనదారుడు.. ఆ ట్రక్కుకి అడ్డు వచ్చాడు. దీంతో ఒక్కసారిగా భయపడిపోయిన ట్రక్ డ్రైవర్ఇవ్వరు
 ట్రక్కును వెంటనే పక్కకు తిప్పాడు. దీంతో ఆ ట్రక్కు రోడ్డు దాటి మరో రోడ్డుపైకి దూసుకుపోయింది. అయితే ఈ ప్రమాదంలో బైకర్ చనిపోయి ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ తాపీగా బైక్ ని యూటర్న్ తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: