ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్.. చైన్ స్నాచర్లకే చుక్కలు చూపించింది?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగలు బెడద కాస్త ఎక్కువగా పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే. తాళం వేసి ఉన్న ఇళ్లకు కన్నం వేసేవారు కొంతమంది అయితే.. ఇక రహదారుల పక్కనే ఉండి సమయం సందర్భం చూసి నిలువు దోపిడీ చేసేవారు మరి కొంతమంది. ఇంకొంతమంది అయితే ఇక ఒంటరిగా ఉన్న మహిళలనే టార్గెట్గా చేసుకొని చైన్స్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు అని చెప్పాలి. ఇలా దొంగలు రోజు రోజుకు రెచ్చిపోతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భయం భయంగానే బ్రతికేస్తున్నారు.

 సాధారణంగా దొంగలను చూస్తే ఎందుకో తెలియకుండానే ప్రతి ఒక్కరి మనసులో భయం మొదలవుతూ ఉంటుంది. ఎక్కడ హాని తల పెడతారో అని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక యువతి మాత్రం తెగువ చూపించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా అపర కాలిలాగా దొంగలపై తిరగబడింది. అసమాన్యమైన ధైర్య సాహసాలను ప్రదర్శించి ఇక దొంగలపై ప్రతిఘటించింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా మారిపోయింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. యువతి ఎప్పటిలాగానే రోడ్డుమీద వెళ్తుండగా బైక్ పైకి వచ్చిన ఇద్దరు చైన్స్ స్నాచర్ లు యువతీ మెడలో ఉన్న బంగారం దొంగలించేందుకు ప్రయత్నించారు.

 అమ్మాయి కదా ఈజీగా పని అయిపోతుందని ఎక్కడ తిరగబడడానికి కూడా ఛాన్స్ ఉండదు అని భావించారు. కానీ ఊహించని రీతిలో సీన్ రివర్స్ అయ్యింది. ఏకంగా ఆమె మెడలో ఉన్న చైన్ దొంగతనం చేయడానికి వచ్చిన ఇద్దరు చైన్ స్నాచర్లను  తీవ్రంగా ప్రతికటించింది యువతి. బైక్ పై వెళ్తున్న ఇద్దరు నిందితులను కూడా గట్టిగా పట్టుకుంది. ఇక ఆమెను విడిపించుకునేందుకు దొంగలు ఎంత ప్రయత్నించినా కూడా కుదరలేదు. ఏకంగా కింద పడిన తర్వాత కూడా లేచి ఒక దొంగను పట్టుకుంది. ఆ దొంగలను భయపడకుండా చితక్కొట్టుంది. చివరికి ఎంతో కష్టం మీద యువతిని తప్పించుకుని దొంగలు పారిపోయారు. అయితే ఈ వీడియో మొత్తం సీసీ కెమెరాలు రికార్డు కావడంతో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: