పైత్యం తగలెయ్య.. మొసలి వేషంలో.. మొసలితో పరాచకాలు.. చివరికి?

praveen
సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం కోసం కొంతమంది చేసే పిచ్చి పనులు అందరిని అవ్వక్కయ్యేలా చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలాంటి పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం ఎందుకు అందరూ కూడా తిట్టిపోసేలా చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా వీడియోనే వెలుగులోకి వచ్చింది. సాధారణంగా  నీటిలో ఉండే మొసలి ఎంత ప్రమాదకరమైనవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా మొసలి దగ్గరికి ఎవరైనా మనిషి వెళ్ళాడు అంటే చాలు ఇక వారిపై దాడి చేసిప్రాణాలు తీసేస్తూ ఉంటుంది.

 అందుకే ఎక్కడైనా మొసలి ఉంది అని తెలిస్తే చాలు అటువైపు వెళ్లడానికి కూడా ఎంతోమంది జంకుతూ ఉంటారని చెప్పాలి. కానీ కొంతమంది మాత్రం ఏకంగా మొసలితో పరాచకాలు ఆడుతూ చివరికి ప్రమాదాల బారిన పడటం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. ఏకంగా నీటి ఒడ్డున సేద తీరుతున్న ప్రమాదకరమైన మొసలి తోనే పరాచకాలు ఆడాడు ఇక్కడొక వ్యక్తి. ఏకంగా సోషల్ మీడియాలో లైకుల కోసం తన జీవితాన్నే పణంగా పెట్టేసాడు అని చెప్పాలి.

 ఇలా ఏకంగా మొసలి లాగానే వేషం ధరించిన ఒక వ్యక్తి నిజమైన మొసలి దగ్గరికి వెళ్లి ఇక పక్కనే పడుకొని ఆట పట్టించడం మొదలుపెట్టాడు. ఏకంగా తన చేతితో ముసలి కాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నించాడు  అయితే అక్కడ ఉన్న మొసలి ఏదో ఆలోచిస్తూ ఇక ఇతని గురించి పట్టించుకోలేదు. కానీ ఒకవేళ కోపంతో ఇతని మీద దాడి చేసి ఉంటే మాత్రం చివరికి అతను ప్రాణాలు పోవడం ఖాయం అనేది మాత్రం ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది.  ఇక ట్విట్టర్లో వైరల్ గా మారిపోయిన ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు. పాపులారిటీ కోసం ఇంత రిస్క్ అవసరమా బ్రో అంటూ అందరూ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: