డేంజర్ స్టంట్: కళ్ళు చెదిరిపోవడం ఖాయం?

Purushottham Vinay
ప్రమాదాలు అనేవి అసలు ఎప్పుడు ఎలా ఎటునుంచి వస్తాయో చెప్పలేము. కాబట్టి అప్రమత్తంగా లేకుంటే ప్రమాదం పెను విధ్వంసాన్ని కలిగిస్తుంది. మనల్ని నమ్ముకుని బతుకుతున్న వాళ్లను చాలా సింపుల్ గా రోడ్డున పడేస్తుంది. అందుకే రోడ్డుపై వెళ్లేటప్పుడు ప్రతి క్షణం కూడా చాలా అలర్ట్ గా ఉండాలి.కార్ లో వెళ్లినా, బైక్ పై వెళ్లినా.. నడుచుకుంటూ వెళ్తున్నా ఖచ్చితంగా చాలా ఉండాల్సిందే. లేకుంటే పెను ప్రమాదం తప్పదనే విషయాన్ని మీరు అస్సలు మర్చిపోవద్దు. సోషల్ మీడియా అనేది ఒక మాయ ప్రపంచం. ఇందులో ఎప్పుడూ కూడా ఎక్కువ స్టంట్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్నింటిని చూస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.ప్రస్తుతం ఒక వ్యక్తి డ్రైవింగ్ కూడా బాగా వైరల్ అవుతూ షాక్ తెప్పిస్తుంది.అతడి డ్రైవింగ్ స్కిల్స్ కు అతన్ని మెచ్చుకోవాలో, లేదా అతని నిర్లక్ష్యంకి అతన్ని తిట్టుకోవాలో తెలియని అయోమయ స్థితిలో పడిపోతారు. ప్రస్తుతం అతని స్టంట్ వీడియో ఒకటి జనాల దృష్టిని ఆకర్షిస్తోంది. 


ఇందులో ఓ కారు డ్రైవర్ హైవేపై వెళ్తున్న రెండు వాహనాల మధ్య నుంచి చాలా ఫాస్ట్ గా వెళ్లడాన్ని చూడవచ్చు. కేవలం 8 సెకన్ల ఈ క్లిప్ చూసి.. ఈ కారు డ్రైవర్ ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్ ఎలా చేశాడని షాక్ అవుతున్నారు నెటిజన్లు.హైవేపై చాలా బండ్లు కూడా అతివేగంతో వెళ్లడాన్ని వీడియోలో చూడవచ్చు. ఇంకా అదే సమయంలో మరో కారు హై స్పీడ్ గా రావడాన్ని చూడవచ్చు. కానీ ఆ తర్వాతి క్షణంలో అందరూ ఊహించనిది ఈ వీడియోలో జరుగుతుంది.ఆ రెండు కార్ల మధ్య నుంచి ఆ కారు వెళ్లేందుకు అవకాశం లేనప్పటికీ ఆ డ్రైవర్ కారుతో కళ్ళు చెదిరిపోయే డేంజర్ స్టంట్ చేశారు. కారుకు ఉన్న నాలుగు చక్రాల్లో కేవలం రెండు చక్రాలపైనే కార్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు దూసుకువెళ్లిపోయాడు. ఈ వీడియో చాలా భయపెడుతూ అంతకంటే చాలా ఎక్కువ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా కూడా ఇక పెద్ద పెను ప్రమాదం జరిగేదే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: