వైరల్ : ఈ కుక్కకి.. వరల్డ్ బెస్ట్ గోల్ కీపర్ అవార్డు ఇవ్వాల్సిందే?

praveen
ఇటీవల కాలంలో ఇళ్లల్లో కుక్కలను పెంచుకోవడం అనేది ఒక ట్రెండ్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు కేవలం సంపన్నులు మాత్రమే ఇలా కుక్కలను పెంచుకోవడం లాంటివి చేసేవారు. కానీ ఇటీవల కాలంలో సామాన్యుల సైతం కుక్కలను పెంచుకోవడం వాటితో ఎంతో ప్రేమగా మెలగడం లాంటివి చేస్తున్నారు. ఏకంగా ఒక కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ఇక పెంపుడు శునకాలపై  ఎంతగానో ప్రేమ చూపిస్తున్నారు అని చెప్పాలి. అంతేకాదు కొంత మంది అయితే తమ పెంపుడు కుక్కలకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇచ్చి ఇంటి పనుల్లో వంట పనుల్లో సహాయం చేసే విధంగా చూసుకుంటున్నారు అని చెప్పాలి   ఇంకొంత మంది  తమ కుక్కలకు స్పెషల్ ట్రైనింగ్ ద్వారా సరికొత్త టాలెంట్ను బయటపడే విధంగా ఏదో ఒక శిక్షణ ఇస్తూ ఉండటం గమనార్హం.

 ఇకపోతే ఇటీవలే ఎంతోమంది ఇలా తమ శునకాలతో ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయడం లాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతూ అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి. పెంపుడు కుక్కలు కూడా ఇలా చేస్తాయా అనే అందరిని అవాక్కే వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విటర్ వేదికగా తెగచక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో కుక్క వేగానికి నెటిజన్లు అందరూ ఫిదా అయిపోతున్నారు. వరల్డ్ లోనే బెస్ట్ గోల్ కీపర్ అంటూ అవార్డు కూడా ఇచ్చేస్తూ ఉన్నారు.

 ఇక ఒక నెటిజన్స్ ట్విట్టర్ లో ఈ వీడియోని పోస్ట్ చేయగా.. ఇది కాస్త తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఒకసారి ఈ వీడియోలో ఏముందో చూసుకుంటే యజమాని ప్లాస్టిక్ బాటిల్ ను ఫుట్బాల్ బంతిలాగా అనుకొని ఏకంగా కుక్క వైపుకి కిక్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ముందుగా ఇక ఆ కుక్కకు దొరకకుండా అటు ఇటు కాలును కదుపుతూ ఇక ఎటు కిక్ చేస్తున్నానో కూడా అర్థం కాకుండా కుక్కను కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఇక కుక్క కూడా ఎంతో వేగంగా స్పందిస్తూ యజమాని తన్నిన ఒక వాటర్ వాటర్ బాటిల్ను ఊహకందని విధంగా క్షణాల్లో నోట్లో పట్టుకుంటుంది. ఇది చూసి కుక్క వేగానికి అందరూ ఫీదా అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: