వైరల్ : ఈ కుక్క క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కి.. ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రపంచ నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా కేవలం నిమిషాల వ్యవధిలో అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో వాలిపోతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా ఎన్నో వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడం లాంటివి చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కుక్కలను పెంచుకోవడం ఒకటి ట్రెండ్ గా మారిపోయిన నేపథ్యంలో కుక్కలను పెంచుకోవడమే కాదు వాటితో సరదాగా గడిపిన క్షణాలను కూడా అందరితో పంచుకోవడం చేస్తున్నారు. తద్వారా ఇలా పెంపుడు కుక్కలకు సంబంధించిన వీడియోలు చాలానే సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి..

 ఇక ఇలాంటి వీడియోలలో కుక్కలు మనుషులతో కలిసిపోయిన తీరు.. ఏకంగా మనుషుల్లాగానే హవ భావాలు పండించడం లాంటివి కూడా ఎక్కువగా వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. ఇక ఈ వీడియోలు కుక్కకు మనిషికి మధ్య కనెక్షన్ ఎంత బలంగా మారింది అన్న విషయాన్ని చెప్పకనే చెబుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి ట్విట్టర్ వేగేదిగా తెగ చక్కర్లు కొడుతూ ఉంది. 19 సెకండ్ల నిడివి గల ఈ వీడియోని చూస్తున్న నెటిజెన్లు తెగ నవ్వుకుంటున్నారు అని చెప్పాలి. కుక్క ఇస్తున్న క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కి ఫిదా అవుతున్నారు.

 సాధారణంగా తల్లి ఆహారం పెడుతున్న సమయంలో చిన్న పిల్లలు కేవలం తమకు ఇష్టమైన ఆహారాన్ని మాత్రమే తింటూ ఉంటారు. ఇక ఇష్టం లేని ఆహారం పెట్టారు అంటే చాలు వద్దు అన్నట్లుగా తల అటు ఇటు ఊపుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ కుక్క కూడా ఇలాంటిదే చేసింది. తనకు ఇష్టమైన చిప్స్ పెట్టినప్పుడు టుక్కున తినేసిన కుక్క  వెజిటేబుల్స్ పెడితే మాత్రం తనకు వద్దు అన్నట్లుగా అటు ఇటు తల తిప్పుతూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ఏకంగా తల్లి దగ్గర పిల్లాడు మారం చేసినట్లుగానే కుక్క క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం చూసి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: