భయంకరమైన టోర్నడో.. అంతా నేలమట్టం చేసేసింది?

praveen
కొన్ని కొన్ని సార్లు ప్రకృతి సృష్టించే విధ్వంసాలు ఊహకందని విధంగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్నా సమయంలో ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో దారుణాలకు కారణమవుతూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని కొన్ని సార్లు చిన్నగా మొదలైన  గాలులు సుడిగాలిలా మారిపోతూ ఉంటాయి. ఈ క్రమంలోనే సుడిగాలి దాటికి కొన్ని కొన్ని సార్లు ఇల్లు దెబ్బ తినే పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది అని చెప్పాలి.ఇలా భారీ సుడిగాలులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటాయి అని చెప్పాలి.

 గింగిరాలు తిరుగుతూ వచ్చే సుడిగాలులు సృష్టించే విధ్వంసం గురించి దాదాపు అందరికీ ఒక అంచనా ఉంటుంది. అయితే ఇక ఇటీవలే వైరల్ గా మారిపోయిన వీడియోలో టోర్నడో సృష్టించిన విధ్వంసం  చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు అవాక్కవ్వకుండా ఉండలేరు అని చెప్పాలి. ఇదెక్కడి టోర్నడో రా బాబు అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. ఉత్తర ఫ్రాన్స్ ప్రాంతంలో ఇలా టోర్నడో బీభత్సం సృష్టించింది. బిహు కోచ్ అనే గ్రామంలో సంభవించిన మినీ టోర్నడో స్థానికులు అందరినీ కూడా తీవ్ర భయాందోళనకు గురిచేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అందరూ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే దాక్కుండిపోయారు.

 ఈ భారీ సుడిగాలి దాటికి గ్రామంలోని పదుల సంఖ్యలో ఇల్లు భవనాలు చూస్తుండగానే నేలమట్టం అయిపోయాయి అని చెప్పాలి. అయితే ఆ ప్రాంతంలో  అకాలంగా వేడి వాతావరణం ఏర్పడింది. చిన్నగా మొదలైన గాలులు ఇక పెద్ద టోర్నడోగా మారినట్లు స్థానిక అధికారులు తెలిపారు. టోర్నడో విధ్వంసం సృష్టించిన దృశ్యాలను కొంతమంది వ్యక్తులు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. బిహుం కోర్ట్ గ్రామంలో సాయంత్రం సమయంలో నల్లటి మేఘాలు ఆకాశంలో కమ్ముకున్న కాసేపటికే ఇలా సుడిగాలి చెలరేగి బీభత్సం సృష్టించినట్లు తెలుస్తోంది. ఇక వైరల్ గా మారిపోయిన వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: