పాపం.. పెళ్లి కూతురు ముందు ఇజ్జత్ మొత్తం పాయె?

praveen
ఇటీవల కాలంలో పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. కేవలం మనదేశంలో పెళ్లిళ్ల గురించి మాత్రమే కాదు విదేశాలలో పెళ్లిళ్లు ఎలా జరుగుతాయి. ఇక తాము పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని ఇంప్రెస్ చేసేందుకు ఎంతోమంది పెళ్ళికొడుకులు ఎలాంటి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తూ ఉంటారు అన్న విషయాలకు సంబంధించిన వీడియోలు తెగ చెక్కలు కొడుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలోనే కొన్ని వీడియోలు అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంటాయని చెప్పాలి.

 ఎందుకంటే పెళ్లికూతురును ఇంప్రెస్స్ చేయడానికి ఏదో చేయబోతే ఇంకేదో అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే సాధారణంగా పెళ్లిలో వరుడు మండపానికి ఊరేగింపుగా వెళ్తాడు. కారు లేదా గుర్రంపై హుషారుగా వెళ్లడం ఇప్పటివరకు మనం చూసే ఉంటాం. కొంతమంది బుల్లెట్ బైక్ పై కాస్త కొత్తగా ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకొంతమంది వెరైటీగా విన్యాసాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ కొత్తగా పెళ్లి చేసుకోబోయే యువకుడు ఇలాంటి ఒక వెరైటీ విన్యాసం చేయబోయాడు. కానీ చివరికి బొక్క బోర్లా పడిపోయాడు.

 వధువు ముందు పరువు మొత్తం పోగొట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఈ వీడియోలో చూసుకుంటే వరుడు బైక్ పై విన్యాసం చేస్తూ వధువు వద్దకు వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. ఇక సరిగ్గా పెళ్లికూతురు వద్దకు చేరుకున్నాడు అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బైక్ స్కిడ్ అవుతుంది. దీంతో ఒకసారిగా ఇక రోడ్డు మీద పడిపోతాడు. ఇక అదృష్టం కొద్ది అతనికి తక్కువ గాయాలు మాత్రమే అవుతాయి.. ఇక ఇలాంటి రిస్కీ స్టంట్ చేసి చివరికి పెళ్లికూతురు ముందు పరువు పోగొట్టుకున్నాడు. ఇది చూసి అవసరమా బ్రో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: