ఇదెక్కడి విచిత్రం.. బ్యాంక్ లో చోరీకి వెళ్లి.. ఏం దొంగలించారో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో  దొంగలు కాస్త కమర్షియల్ గా ఆలోచిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు అయితే ఏ ఇంటికి కన్నం వెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండేవారు దొంగలు. కానీ ఇటీవలే కాలంలో మాత్రం ఇంటికి కన్నం వేస్తే ఏం వస్తుంది అదే బాగా డబ్బులు ఉండే బ్యాంకుకు కన్నం వేస్తే అందిన కాడికి దోచుకోవడానికి అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్ ప్రకారం ఇక బ్యాంకుకు కన్నాలు వేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇలా దొంగలు చోరీకి వెళ్లారు అంటే చాలు అందిన కాడికి దోచుకోవడం చేస్తూ ఉంటారు.

 ఇప్పటివరకు దొంగలు భారీగా దోచుకోవడం మాత్రమే చూసాము. కానీ కొంతమంది దొంగలు వ్యవహరించే తీరు మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటుంది   బ్యాంకు చోరీలకు వెళ్ళినప్పుడు తమ దగ్గర ఉన్న మారణాయుధాలతో బెదిరించి చివరికి అక్కడ ఉన్న క్యాష్ కౌంటర్ మొత్తం కొల్లగొడుతూ ఉంటారు దొంగలు. ఇలాంటి దొంగతనాలకు పాల్పడి పోలీసులకు సవాలు విసురుతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఇలాంటి వీడియోలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్లో చెక్కర్లు కొడుతుంది.

 వైరల్ గా మారిపోయిన వీడియోలో చేసుకుంటే కొంతమంది దొంగలు తుపాకీ పట్టుకొని బ్యాంకులో దోపిడీ చేయడానికి వచ్చారు. డబ్బు నగలు కాకుండా ఇంటర్నెట్ రూటర్, మొబైల్ ని తీసుకోవడం కనిపిస్తుంది. బ్యాంక్ లో ఉద్యోగులు పనిచేసుకునే సమయంలో ఇంటర్నెట్ రూటర్, మొబైల్స్ లాక్కుని పారిపోతున్న దృశ్యం సీసీ కెమెరాలలో రికార్డు అయ్యింది. ఈ దొంగతనం గురించి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లో వెలుగులోకి వచ్చింది. అయితే ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు చర్యలు మొదలు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: