సోషల్ మీడియాలో ఎప్పుడూ అనేక రకాల వీడియోలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మరో భయానక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఓ చిన్నారి ఎంత కష్టాన్ని అనుభవించిందో చూస్తే బాధ ఇంకా భయం వేస్తుంది.బస్సు దిగుతుండగా బాలిక బ్యాగ్ అనుకోకుండా బస్సు డోర్లో ఇరుక్కుపోయింది. అది బస్సు డ్రైవర్ గమనించలేదు. చూడకుండా స్కూల్ బస్సును వేగంగా స్టార్ట్ చేసి ముందుకు బయల్దేరాడు. చిన్నారి ప్రమాదకరంగా బస్సుకు వేలాడుతుందని డ్రైవర్ తెలుసుకునే సమయానికి..ఆ చిన్నారి కొన్ని మీటర్ల దూరం వరకు బస్సు వెంట ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాలిక అద్భుతంగా బయటపడింది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని కెంటకీలో చోటుచేసుకుంది. అయితే ఈ కేసు 2015 నాటిదిగా తెలిసింది. దీని వీడియో మళ్లీ ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో పింక్ కలర్ స్కూల్ బ్యాగ్ వేసుకుని ఉన్న చిన్నారి బస్సు దిగుతుండగా అమ్మాయి బ్యాగ్ తలుపుల మధ్యలో ఇరుక్కుపోయిన సీన్ కనిపించింది.
అయితే, ఇది బస్సు డ్రైవర్ దృష్టికి రాకపోవడంతో ఆ లేడీ డ్రైవర్ బస్సు నడుపుతూనే ఉంది. ఈ ఘటన మొత్తం బస్సులోని సీసీ కెమెరాలో రికార్డయింది.బస్సు పాటుగానే చిన్నారి కూడా కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. బాలిక తృటిలో ప్రాణపాయ స్థితి నుంచి బయటపడింది. ఈ ఘటన తర్వాత డ్రైవర్‌ను ఉద్యోగం నుంచి తొలగించి ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ వీడియోను డీన్ బ్లండెల్ అనే వినియోగదారు ట్విట్టర్లో షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు 65 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.. చిన్నారి తృటిలో ప్రాణాలతో బయటపడింది. అదృష్టం బాగుంది.. బస్సు డ్రైవర్‌ను తొలగించారు.. అనే క్యాప్షన్‌లో వినియోగదారు వీడియోని షేర్ చేశారు. ఇక ఈ సీసీ ఫుటేజీ చూసిన నెటిజన్లు అంతా కూడా షాక్ అవుతున్నారు. కొందరు ఈ వీడియోను ఒళ్లు గగ్గుర్పొడిచేలా ఉందంటూ కూడా ఎన్నో షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే చాలా మంది ప్రజలు మాత్రం డ్రైవర్ అలా ఎలా గమనించలేదని చాలా మండిపడుతున్నారు.