ఆధునిక వ్యవసాయం అంటే ఇదేనేమో.. రైతు ఆలోచనకు అందరూ ఫిదా?

praveen
ఇండియాలో వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడైతే వ్యవసాయం చేసే వారు తగ్గిపోయారు. కానీ ఒకప్పుడు మాత్రం దేశంలో ప్రధాన ఉపాధి వ్యవసాయమే అన్నట్లుగా కొనసాగుతూ ఉండేది. అయితే ఒకప్పటి పద్ధతులకు ఇప్పటి పద్ధతులకు వ్యవసాయంలో ఎన్నో రకాల మార్పులు వచ్చాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. వ్యవసాయంలోకి వినూతమైన టెక్నాలజీ అందుబాటులోకి తీసుకు వస్తున్న నేపథ్యం కొత్త పద్ధతులను పంటలు పండించేందుకు వాడుతున్నారు రైతులు.

 ఈ క్రమంలోనే వ్యవసాయాన్ని మరింత సులభతరం  చేసుకునేందుకు రైతులు ఊహకందని విధంగా వినూత్నమైన  ఆలోచన చేస్తూ ఉండడం సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియో చూసిన తర్వాత సృజనాత్మకత విషయంలో భారతీయులు ప్రతి ఒక్కరిని ఓడించగలరు అన్న విషయం మాత్రం మరోసారి కళ్ళు ముందు కనిపిస్తుంది అని చెప్పాలి. వ్యవసాయంలో ఒక సరి కొత్త పద్ధతిని కనుగొన్నాడు రైతు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది.

 సాధారణంగా ట్రేడ్మిల్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది బరువు తగ్గడానికి ప్రతి రోజు వాకింగ్ చేసే యంత్రం. కానీ ఇక్కడ మాత్రం ట్రేడ్ మిల్ ఎవరు ఊహించిన విధంగా ఏకంగా పంటకు సాగునీటిని అందించడం కోసం ఉపయోగించాడు రైతు. ఈ క్రమంలోని ట్రేడ్మిల్ లాంటి యంత్రంపై ఎద్దును నడిపిస్తూ సాగుకు కావలసిన నీటిని మోటార్ల సాయంతో కరెంటు ఉత్పత్తి చేస్తూ ఉన్నాడు రైతు. ట్రేడ్మిల్ లాంటి యంత్రాలపై ఎద్దు నడుస్తూ ఉండగా పైపుల ద్వారా నీరు పంటపొలాల్లోకి చేరుతుంది అంతేకాకుండా కరెంటును కూడా సైతం ఉత్పత్తి చేస్తూ పంటలు సాగుకు వాడుతూ ఉండడం గమనార్హం .ఇక ఈ వీడియో చూసిన నేటిజన్లో రైతు సృజనాత్మక ఆలోచనకి ఫిదా అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: