వైరల్ : గన్ పేల్చే లోపు.. సూపర్ మ్యాన్ లా వచ్చాడు?

praveen
పక్క వాళ్లకి  ఏమైనా ఫర్వాలేదు మనం సంతోషంగా ఉన్నామా లేదా అని స్వార్థపూరితంగా ఆలోచించే లోకంలో ప్రస్తుతం మనం బ్రతుకుతున్నాం. మనం మన వాళ్లు బాగుంటే సరిపోతుంది.ఈ లోకం మొత్తం ఏమైపోతే ఏంటి అనుకుంటూ అందరూ బ్రతికేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇక కళ్ళముందే ప్రాణాలు పోతున్న కూడా పట్టించుకునే వారు కరువయ్యారు అని చెప్పాలి. ఇలాంటి తరహా ఘటనలు చూసినప్పుడు మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగై పోయింది అన్నది మాత్రం అర్థమవుతూ ఉంటుంది. కానీ ఇప్పటికి కూడా కొన్ని ఘటనలు మనుషుల్లో మానవత్వం బ్రతికే ఉంది అని అన్న దానికి నిదర్శనం గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 ఇక్కడ ఒక వ్యక్తి తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ తల్లీకూతుళ్లను ఒక దొంగ బారి నుంచి కాపాడాడు. దీంతో సోషల్ మీడియాలో హీరోగా మారిపోయాడు అని చెప్పాలి. ఫ్లోరిడా ఫోర్త్ వాల్టన్ బీచ్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కారు దొంగతనం చేయడానికి వచ్చిన ఒక వ్యక్తి ఒక కారు యజమానికి తుపాకీ చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు.ఇలా దొంగ ఆ యజమాని ని బెదిరిస్తున్న సమయంలో ఆమె చేతిలో ఒక చంటి పిల్లనీ ఎత్తుకొని ఉంది. ఎవరైనా హెల్ప్ చేయండి అంటూ గట్టిగా అరవడం మొదలు పెట్టింది.

 ఇక ఎంత చెప్పినా సదరు మహిళ గట్టిగా అరుస్తూ ఉండడంతో తుపాకీతో కాల్చేయడానికి సిద్ధమయ్యాడు దొంగ. ఇక తుపాకీతో కాల్చడానికి ముందు క్షణకాల వ్యవధిలో మెరుపు వేగం తో దూసుకు వచ్చిన ఒక వ్యక్తి దొంగ ను పక్కకు నెట్టేశాడు. దీంతో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. అంతలో  మరింత బిగ్గరగా అరిచిన మహిళ చుట్టుపక్కల వాళ్ళని పిలిచింది. కారు దొంగలించాలని భావించిన దొంగ దొరికిపోయాడు. అందరూ అతన్ని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఇలా మహిళను కాపాడిన వ్యక్తి రెస్టారెంట్ లో పనిచేసే మైకేల్ గా గుర్తించారు..  ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్  గా మారి పోవడం తో అతను సోషల్ మీడియాలో సూపర్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Gun

సంబంధిత వార్తలు: