వైరల్ : వీధి కుక్క చేసిన పనికి.. కాంగ్రెస్, బీజేపి మధ్య విమర్శలు?

praveen
సాధారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. కొన్ని రకాల వీడియోలు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్ పై కుక్క హాయిగా నిద్రపోతుంది. ఇది సంచలనంగా మారిపోయింది. ఈ వీడియో మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది అన్నది తెలుస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రిలో బెడ్ పై కుక్క హాయిగా ఫ్యాన్ గాలి కింద నిద్రపోతున్న  వీడియో ట్విట్టర్లో చక్కెర్లు కొట్టడంతో ఇది సరికొత్త రాజకీయ చర్చకు దారితీసింది.

 రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ పరిస్థితి ఇంత అధ్వానంగా ఉంది అంటూ ప్రతిపక్ష పార్టీ అధికార బీజేపీ పై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతుంది.. అయితే ఇదే విషయంపై అటు రాత్లామ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గా ఉన్న డాక్టర్ ప్రభాకర్ వివరణ కోరగా తాను సెలవులో ఉన్నందున ఈ ఘటన గురించి తనకు తెలియదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ వీడియోని ఎంపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి నరేంద్ర ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం గమనార్హం. బీజేపీ పాలనలో కుక్కలు మాత్రం ఆస్పత్రిలో బెడ్ పై నిద్రపోతుంటే ఎంతో మంది రోగులు మాత్రం పడకలు  దొరక్క ఇబ్బంది పడుతున్నారు అంటూ విమర్శలు చేశారు.

 రాష్ట్రంలో ఆందోళన కలిగించే ఆరోగ్య వ్యవస్థ ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటన కాస్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. ఈ విషయంపై స్పందిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు అధికార బీజేపీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉండగా.. మరోవైపు బిజెపి పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ కు గట్టిగానే కౌంటర్ ఇస్తూ ఉండడం గమనార్హం. ఏదేమైనా కుక్క చేసిన పని ప్రస్తుతం పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: