ప్రభుత్వ ఉద్యోగం వదిలేసాడు..ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

Satvika
మనుషుల ఆలోచనలు ఎప్పుడూ ఎలా మారుతాయో ఎవరికీ తెలియదు.. కొంతమందికి కొన్ని లక్ష్యాలు వుంటాయి.వాటిని చేరుకోవటానికి ఎన్నో త్యాగాలు చేస్తారు.మరెన్నో కొత్త అలవాటులను అలవర్చుకుంటున్నారు. ఇప్పుడు ఓ వ్యక్తి తన లక్ష్యాన్ని సాధించడం కోసం తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి కష్టపడ్డాడు. చివరికి అనుకున్నది సాధించి ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలిచాడు. అతని గురించి ఇప్పుడు తెలుసుకుందాం…

రాజస్థాన్‌లోని శ్రీగంగా నగర్‌కు చెందిన మంజిత్ ఎమ్‌ఏ, ఎమ్‌ఫిల్ చదివాడు. 13 ఏళ్ల క్రితమే ప్రభుత్వోద్యోగం అతడిని వెతుక్కుంటూ వచ్చింది.. అతను ఆ ఉద్యోగం లో చేరలేదు. తండ్రి ఎంత చెప్పినా అతడు ఉద్యోగం లో చేరకుండా పొలం బాట పట్టాడు. తన జ్ఞానం మొత్తాన్ని పొలాల పై పెట్టుబడిగా పెట్టాడు. ప్రస్తుతం నెలకు లక్ష రూపాయలు, ప్రతి ఏటా 12 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం, మెరుగైన నీటి నిర్వహణ తన విజయానికి కారణాలని మంజిత్ చెబుతున్నాడు.

మంజిత్ తన ఆరెకరాల పొలంలో సాంప్రదాయేతర వ్యవసాయ పద్ధతుల ద్వారా గోధుమలను, కూరగాయల మొక్కలను పండిస్తున్నాడు. కొత్త వ్యవసాయ పద్ధతులను తెలుసుకుని వాటిని అమలు చేస్తుంటాడు. 2005లో మంజీత్ వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. నాలుగేళ్లపాటు గోధుమలు, నర్మాలను పండించాడు. అయితే మొదట లాభాలను పొందలేదు..తర్వాత లాభాలను అందుకున్నాడు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు గోధుమలు పండిస్తాడు. జూన్ నుంచి నవంబర్ వరకు క్యాబేజీ, కాలీఫ్లవర్, మిరప, బెండకాయ, టమాటా మొక్కలను పండిస్తాడు.


ఆగస్టులో ఉల్లిపాయ మొక్కలను తయారు చేస్తాడు. అవి అక్టోబర్, నవంబర్ నెలల్లో అమ్మకానికి వెళతాయి.. ఇక అక్కడి రైతులు కూడా అతని వద్ద నుంచి మొక్కలను తీసుకొని పంటలను కూడా వేస్తున్నారు.. మంచి లాభాలను అందుకున్నారు.అలా అందరూ అతని అడుగు జాడల్లో నడుస్తూ వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు..నిజంగా ఇలాంటి సాహసం చెయ్యడం గ్రేట్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: