వైరల్ : రెండు సెకన్లలో.. రెండుసార్లు ప్రాణాలు కాపాడిన హెల్మెట్?

praveen
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది అనే విషయం తెలిసిందే . ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అధికారులు ఎంత మొత్తుకున్నా ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన ఎంతోమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఎంతోమంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి వస్తుంది. ఇలా చేజేతులారా తమ ప్రాణాలు రిస్క్ లో పెట్టుకుంటున్నారు వాహనదారులు.

 ఈ క్రమంలోనే రోడ్డు నిబంధనల పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి  వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యత గురించి చెప్పడానికి అటు ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు వినూత్నమైన దారులను వెతుకుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని ఆసక్తికర వీడియోలను కూడా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.  ఇలాంటి వీడియోలు చూసినప్పుడు నిజంగా హెల్మెట్ పెట్టుకుంటే  ప్రాణాలను రక్షించుకున్నట్లే అవుతుంది అని ఎంతో మంది వాహనదారులు అనుకుంటారు.

 ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ఢిల్లీ  లో ఒక యువకుడు హెల్మెట్ పెట్టుకున్నందుకు కేవలం రెండు సెకన్ల వ్యవధిలో రెండుసార్లు ప్రాణాలు కాపాడింది హెల్మెట్. ఈ వీడియోని పోలీస్ అధికారులు అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.  హెల్మెట్ పెట్టుకుంటే ఒక సారి కాదు రెండు మూడు సార్లు అనేక సార్లు  ఎప్పుడు అది మిమ్మల్ని కాపాడుతుంది అంటూ పేర్కొన్నారు పోలీసులు. హెల్మెట్ పెట్టుకున్న వారిని దేవుడు రక్షిస్తాడు అంటూ ఒక క్యాప్షన్ కూడా ఇచ్చారు. వీడియోలో చూసుకుంటే ఒక యువకుడు కారును దాటేందుకు ప్రయత్నించి చివరికి పడిపోతాడు. తర్వాత లేవడానికి ప్రయత్నించగా  తలపై పోల్  పడుతుంది. ఇలా ఒకసారి బైక్ మీద నుండి పడినప్పుడు ఒకసారి స్థంభం మీద పడినప్పుడు హెల్మెట్ అతని ప్రాణాలు రక్షించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: