రిస్కీ స్టంట్లు చేసిన బైకర్స్.. చిప్పకూడు తినిపించిన పోలీసులు?

praveen
ఇప్పటికే రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోన్నాయి అన్న విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదాల కారణం గా ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండి పోతూనే ఉంది. ఇలాంటి సమయం లో జాగ్రత్తగా వాహనం నడపాల్సింది పోయి కొంత మంది ఆకతాయిలు మాత్రం నిర్లక్ష్యం  గా వ్యవహరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే కొందరు సరదా కోసం చేసే పనులు చివరికి కుటుంబాల్లో విషాదాన్ని నింపుతూ ఉన్నాయి అని చెప్పాలి. రోడ్డుపై నార్మల్గా బైక్ నడపటం కాదు రిస్కీ స్టంట్స్ చేస్తూ ఉంటారు ఎంతోమంది.

 ఇటీవల కాలం లో ఇలాంటి తరహా వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోతున్నాయి అన్న విషయం తెలిసిందే.  ఎవరైనా వాహనదారులు ఇలా నిర్లక్ష్యం గా విన్యాసాలు చేస్తూ వాహనం నడిపితే  వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్న ఘటనలు కూడా వెలుగు లోకి వస్తున్నాయి. ఇటీవల ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇటీవలే చెన్నైలోని టేనాంపేట రహదారిపై లక్ష  వైఖరిలో ఒక బైక్ ముఠా  ప్రమాదకరమైన విన్యాసాలు చేసింది.  ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది.

 బైక్ గ్యాంగ్ చేస్తున్న ప్రమాదకరమైన విన్యాసాలు చూసిన ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.ఈ వీడియోని ట్విట్టర్లో పోలీసులతో షేర్ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఈ వీడియోని ఎంతో సీరియస్గా తీసుకున్న పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. రామాయంపేట కు చెందిన పెట్రోల్ మాలిక్, సెబీయం కు చెందిన ఇమ్రాన్ ఖాన్, ముఖేష్ తిరుపత్తూరు కు చెందిన మహ్మద్ హరీష్, సైఫాన్ లుగా గుర్తించి కటకటాల వెనక్కి తోసి చిప్పకూడు పెట్టారు. ఇక వీరిలో ప్రధాన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: