వైరల్ : చూడ్డానికి చిన్న కారు.. కానీ 27 మంది ఎలా పట్టారో?

praveen
సాధారణంగా 5 సీటర్ కార్ లో ఎంతమంది కూర్చుంటారు. 5 సీటర్ కారు అన్న తర్వాత ఐదు మంది కూర్చుంటారు. ఇంకా ఎక్కువ మంది ఎలా కూర్చుంటారా అని సమాధానం చెబుతారు ఎవరైనా..  ఇక మరీ ఇరకాటం గా అయితే మరో ఇద్దరినీ కూర్చోబెట్టు కోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా 5 సీటర్ కారులో ఏడుగురు కాస్త ఇబ్బందిగా ఎక్కడికైనా వెళ్లొచ్చు. కానీ ఒక చిన్న ఫై సీటర్ కార్ లో 27 మంది కూర్చోవడం గురించి ఎప్పుడైనా విన్నారా అంటే.. హా విన్నాము చూసాము కూడా అతడు సినిమాలో మహేష్ బాబు ఫైట్ సీన్ లో అలాగే ఒకే కారులో నుంచి చాలామంది రౌడీలు వస్తారు కదా అని అంటారా.. సినిమాలో కాదు లెండి నిజ జీవితంలో ఇలాంటి ని ఎప్పుడైనా చూసారా అంటే చూడలేదు అనే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంటుంది.

 కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇక్కడ వీడియో లో కనిపిస్తుంది మనందరికీ తెలిసిన ఫైవ్ సీటర్ కారు. కానీ ఈ ఫైవ్ సీటర్ కార్ లో కూర్చుంది  ఏకంగా 27 మంది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా చక్కర్లు కొడుతూ ఉండడంతో ఇది చూసిన ఎంతో మంది నెటిజన్లు అవాక్కవుతున్నారు అని చెప్పాలి. ఇలా కారులో 27 మంది కూర్చొని ఏకంగా ప్రపంచ రికార్డు నెలకొల్పారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు.

 ఇక ఇలా ఒక కారులో 27 మంది కూర్చున్న వీడియోని గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఒక మినీ కూపర్ లో ఎంత మంది కూర్చోగలరు అంటూ ఒక క్యాప్షన్ కూడా పెట్టింది. ఇక ఈ వీడియో చూసిన వారు మాత్రం 27 మందిని ఎలా పట్టించారు రా బాబు అంటూ కామెంట్ చేస్తూ ఉండడం గమనార్హం. మూడు నిమిషాల నిడివిగల ఈ క్లిప్ లో వ్యక్తులు ఒకరి తర్వాత మరొకరు మినీ కూపర్ లో కూర్చోవడం చూడవచ్చు. ఇక తమ శరీరాలను ఎంతో ఫ్లెక్సిబుల్గా మారుస్తూ 5 సీట్లలో 27 మంది కూర్చున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: