నా గణేశున్ని తీసుకెల్లొద్దు.. విగ్రహాన్ని పట్టుకుని ఏడ్చిన చిన్నారి?

praveen
వినాయక చవితి రోజు నుంచి పూజలందుకుంటున్న గణనాథులు అందరూ కూడా ప్రస్తుతం గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు అనే విషయం తెలిసిందే. వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించి ఎంతో నిష్టగా పూజలు చేసిన భక్తులందరూ కూడా ఎంతో బాధతో కూడిన హృదయాల తో  వినాయకుడి నిమజ్జనం చేస్తూ ఉండటం గమనార్హం. వెళ్లి రా గణేశా మళ్లీ రా గణేష అంటూ వినాయకుడి నిమజ్జనం ఆలు జరుపుతున్నారు. ఈ క్రమం లోనే ఎక్కడ చూసినా డప్పు వాయిద్యాల మధ్య వినాయక నిమజ్జనాలు ఎంతో హోరా హోరీగా జరుగుతున్నాయి అన్న విషయం తెలిసిందే.

 వినాయక చవితి నాడు వినాయకుడి ప్రతిమలు ప్రతిష్టించుకుని పూజలు చేసి విధిగా నిమజ్జనం చేయడం వల్ల ఏడాది పొడవునా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఎంతోమంది భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు. అయితే ఎన్నో రోజుల పాటు గణనాథుని ఇంట్లో కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ఉంటారు ఎంతో మంది భక్తులు. ఈ క్రమంలోనే నిమజ్జనానికి వెళుతున్నప్పుడు భావోద్వేగానికి లోనవుతుంటారు అని చెప్పాలి. ముఖ్యంగా చిన్నారులు గణనాథుని వదిలిపెట్టడానికి అస్సలు ఇష్టపడరు. ఇప్పుడు ఇలాంటి తరహా మీడియా ఒకటి వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

 వినాయకుడి నిమజ్జనం చేయడానికి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చింది ఆ చిన్నారి. అయితే అక్కడ చుట్టుపక్కల వినాయక ప్రతిమలను గంగలో నిమజ్జనం చేస్తూ ఉండడం చూసి ఇక తన వినాయకుడిని కూడా అలా చేస్తారేమో అని భయపడింది. కుటుంబ సభ్యులు గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్తుండగా పాప మాత్రం గట్టిగా గణేష్ విగ్రహాన్ని హత్తుకునీ ఏడ్చింది పాప. తల్లి బలవంతంగా గణేష్ విగ్రహాన్ని కిందకు దింపడానికి ప్రయత్నం చేసిన ఆ పాప మాత్రం కిందికి రాలేదు..  అయితే ఈ వీడియో ప్రతి ఒక్కరి మనసును హత్తుకుంటుంది అని చెప్పాలి. ఇటీవల కాలంలో ఇలాంటి తరహా వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: