వైరల్ : ఇదెక్కడి డాన్స్ మావా.. చూస్తే మైండ్ బ్లాకే?

praveen
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ప్రతిరోజు లక్షల వీడియోలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఈ క్రమంలోనే కొన్ని వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్ గా మారిపోతూ ఉంటాయి.. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు ప్రతి ఒక్కరూ అవాక్కవుతు ఉంటారు అని చెప్పాలి. ముఖ్యంగా ఇటీవల కొంతమంది వివిధ వేడుకలలో డాన్సులు చేస్తూ ఉన్న వీడియోలను సెల్ఫోన్లో చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో అందరితో పంచుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో కొన్ని డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి వావ్ అని అనిపిస్తూ ఉంటే... మరికొన్ని చేసి ఇదేం డాన్సు రా నాయనా అని అనిపిస్తూ ఉంటుంది.

 ఇక ఇప్పుడు ఇలాంటి డాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఇలా వైరల్ గా మారిపోయిన వీడియోలో డాన్స్ చూస్తే మాత్రం తెగ నవ్వుకుంటారు అని చెప్పాలి. ఇలాంటి డాన్స్ అనేది భూమి మీద ఒకటి ఉందా అని అవాక్కవుతారు. ఇక ఈ వీడియోలో చూసుకుంటే ముగ్గురు మహిళలు డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. ఇక అందరూ కేవలం రెడ్ కలర్ చీరలు మాత్రమే కట్టుకున్నారు. ఏకంగా పూనకం వచ్చినట్లు గానే డాన్సులు చేస్తూ ఉన్నారు. అయితే ఇలా డాన్సు చేస్తున్న వారిలో ఉత్సాహం నింపేందుకు చుట్టూ ఉన్న వారందరూ కూడా చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేయడం గమనార్హం.

 ఈ క్రమంలోనే అక్కడ బీట్ కు తగ్గినట్లుగా ఎక్స్ప్రెషన్ ఇస్తూనే సూపర్ఫాస్ట్ డాన్స్ చేశారు. ఇక ఇది చూసిన ఎంతో మంది నెటిజన్లు ఆంటీలు అందరూ కలిసి ఏదో కొత్త డాన్స్ కనుగొన్నట్లు ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం. ఏకంగా గురుత్వాకర్షణను ఓడించి మరీ గాల్లో తేలుతూ డాన్స్ చేస్తూ కనిపించారు అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఆంటీలు మొత్తం డాన్స్ చేస్తున్న సమయంలో పూర్తిగా వెనక్కి వంగి డాన్స్ చేయడం గమనార్హం. ఇంకొంతమంది ఇదెక్కడిడాన్స్  రా మామ చూస్తే మైండ్ బ్లాక్ అయింది అంటూ కామెంట్ చేస్తున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: