వైరల్ : అమ్మాయిని బెదిరించిన చైన్ స్నాచర్.. చివరికి సరైన గుణపాఠం?

praveen
ఇటీవలి కాలంలో ఎక్కడ చూసిన దొంగల బెడద కాస్త ఎక్కువగానే పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది దొంగలు ఇంట్లోకి చొరబడి చోరీలు చేస్తుంటే మరి కొంత మంది దొంగలు ఏకంగా బ్యాంకులకే కన్నాలు  వేస్తున్నారు.  మరి కొంత మంది దొంగలు ఏకంగా ఏటీఎంలో చోరీలకు పాల్పడుతు ఉండడం గమనార్హం. అదేసమయంలో మరికొంతమంది ఏకంగా ఒంటరి మహిళలను  టార్గెట్గా చేసుకొని మెడలో ఉన్న బంగారు నగలు ఎత్తుకెళ్లడమే మ లక్ష్యంగా చైన్ స్నాచింగ్ కి  పాల్పడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో చైన్ స్నాచర్లు కారణంగా ఎంతోమంది మహిళలు బయట ధైర్యంగా తిరగలేక పోతున్నారూ  అని చెప్పాలి.

 మారణాయుధాలు చూపించి భయపెట్టి ఇక బంగారు నగలు దోచుకోవడం లాంటివి చేస్తూ ఉన్నారు.  ఇలా ఎంతోమంది కేటుగాళ్లు చైన్ స్నాచింగ్ కు  పాల్పడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇప్పుడు ట్విట్టర్లో ఇలాంటి తరహా వీడియో ఒకటి తెగ చక్కెర్లు కొడుతుంది.  ఇది చూసిన తర్వాత నెటిజన్లు అందరూ కూడా అవాక్కవుతున్నారు అని చెప్పాలి. ఈ వీడియోలో చూసుకుంటే బైకర్లు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అమ్మాయిలను తుపాకీతో బెదిరించి దోచుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారికి  అటువైపుగా వచ్చినఒక కారులో ఉన్న వ్యక్తి మాత్రం ఊహించని షాక్ ఇచ్చాడు అని చెప్పాలి.

 ఏకంగా  తన కారుతో చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తుల ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. దీంతో వారు అక్కడే పడిపోయారు అని చెప్పాలి.  ఆ తర్వాత కుంటుకుంటూ పారిపోయేందుకు ప్రయత్నించారూ.   ముందుగా బైక్ ని అక్క అక్కడే చక్కర్లు కొడుతూ అక్కడ ఉన్న అమ్మాయిలను భయపెట్టి వారి దగ్గర ఉన్న విలువైన వస్తువులను దోచుకోవడానికి ప్రయత్నించారు. అయితే వెనుక నుంచి ఒక కారు వచ్చింది. ఇక్కడ జరుగుతుంది గమనించిన కారులో ఉన్న వ్యక్తి కారుతో దొంగలను  ఒక్కసారిగా ఢీకొట్టడంతో వాళ్లు గాల్లో ఎగిరి పడ్డారు.  కుంటుకుంటూ అక్కడి నుంచి పారిపోయారు. ఇది చూసిన నెటిజన్లు  దొంగలకు అతను సరైన బుద్ధి చెప్పాడు అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: