వైరల్ : ఏనుగు చేసిన పనికి.. అందరూ అవాక్?

praveen
ఇటీవలి కాలంలో ప్రతిరోజు జంతువులకు సంబంధించిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాయన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే కొన్ని వీడియోలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ముఖ్యంగా భారీ ఆకారం కలిగిన  ఏనుగులకు సంబంధించిన వీడియో ఏదైనా  నెట్టింట్లో కి వచ్చిందంటే చాలు అది తెగ చక్కర్లు కొడుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇటీవలే  ఏనుగుకు సంబంధించిన ఒక వీడియో ట్విట్టర్ వేదికగా తెగ వైరల్ గా మారిపోయింది. ఏనుగు చేసిన పనికి ఏకంగా అందరూ ఫిదా అవుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇటీవల కాలంలో  వాహనదారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మిగతా వాహనదారులకు ఇబ్బంది కలుగుతుంది అన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా తమ వాహనాన్ని ఇష్టం ఉన్న చోట పార్కింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారూ.  అక్కడ నో పార్కింగ్ బోర్డు దర్శనం ఇచ్చినప్పటికీ కూడా పట్టించుకోకుండా పార్కింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ఇలా నో పార్కింగ్ జోన్ లో ఎవరైనా పార్కింగ్ చేస్తే వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వాహనాన్ని అక్కడి నుంచి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించడం లాంటివి చేస్తూ ఉంటారు.

 ఇక్కడ ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా నో పార్కింగ్ జోన్లో వాహనాన్ని పార్కింగ్ చేశాడు.  అయితే అటువైపుగా వచ్చిన ఒక భారీ ఏనుగుకు అది అస్సలు నచ్చలేనట్టు  ఉంది.  నో  పార్కింగ్ లో ఉన్న బైక్ ని కింద పడగొట్టింది. కాలితో గట్టిగా తన్ని మరింత దూరం జరిపింది.   ఇదంతా షాపులోని సీసీ కెమెరాల్లో రికార్డయింది.  ఇక ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ అధికారి తనఆంధ్ర అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు నో పార్కింగ్ జోన్ లో పార్కింగ్ చేసిన వాహనదారుడు కి ఆ ఏనుగు  సరైన బుద్ధి చెబుతుంది అంటూ కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: