ప్రపంచంలోనే అత్యంత ఒంటరి మనిషి మృతి?

Purushottham Vinay
ఈ భూ మండలంపై ఉన్న అత్యంత అద్భుతమైన ప్రదేశాల్లో అమెజాన్ ఫారెస్ట్ కూడా ఖచ్చితంగా ఒకటని చెప్పాలి.అలాగే ప్రపంచంలో చాలా పెద్ద అడవి. ఇంకా అందమైన భయంకరమైన అడవి.ఇక్కడ ఇప్పటికీ బయట ప్రపంచం ఏమాత్రం తెలియకుండా, పూర్తి అడివి మనుషుల్లా బ్రతుకుతున్న మానవ జాతులు కూడా చాలా ఉన్నాయి.అంతకంటే ముఖ్యంగా, ప్రపంచంలో అత్యంత ఒంటరిగా బతుకున్న వ్యక్తి కూడా ఈ అడవిలో ఉన్నాడు. తన తెగకు చెందిన ఒకే ఒక్క, చివరి మనిషి తానే కావడం విశేషం. అయితే, ఇప్పుడు ఈ వ్యక్తి మరణించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. అనాది తెగకు ప్రతినిధిగా ఉన్న ఈ చివరి వ్యక్తి మరణం సామాజిక కార్యకర్తల్లో చాలా చర్చకు దారితీసింది. కళలు, భాషల పరిరక్షణ కోసం పని చేసే అనేక మంది కార్యకర్తలు, ఇతని మరణంతో బ్రెజిలియన్ అమెజాన్ తెగల మొత్తం శ్రేణిని కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు.ఇక ఈ వ్యక్తిని "ఇండిజినస్ మ్యాన్ ఆఫ్ ది హోల్‌ (Índio do Buraco)" అని పిలుస్తారు. 


 అతడు బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా బతకాలని అనుకుంటాడు. తన నివాసం చుట్టూ గోతులు తవ్వి, ట్రాప్‌లు సృష్టిస్తాడు, అలాగే, ఎవరైన తన దగ్గరకు వస్తే, బాణాలతో నిరోధిస్తాడు. ఎందుకంటే, అతను ఆధునిక మనిషి నుండి ఎన్నో కష్టాలను ఎదుర్కున్నాడు. దశాబ్దాల కాలంలో, అతని భూమిపై దాడి జరిగింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు చంపబడ్డారు. అందుకే, అతడు తనని ఎవరైనా తనను సంప్రదించడానికి చేసిన అన్ని ప్రయత్నాలను ప్రతిఘటించాడు. ఈ వ్యక్తి గురించి స్థానిక మీడియాలో చాలా కథనాలు ప్రసారమయ్యాయి. అనేక డాక్యుమెంటరీల్లో కూడా కనిపించాడు.ప్రస్తుతం, బ్రెజిల్‌ అమెజాన్‌లో 300 కంటే తక్కువ స్థానిక తెగలు ఉన్నట్లు విశ్వసిస్తున్నారు. అయితే, వారి సంఖ్య నెమ్మదిగా తగ్గుతోంది. మరో 30 గ్రూపులు ఉన్నాయనే అంచనా ఉంది కానీ నిపుణులకు వాటిపై సమాచారం లేదు. కాగా, "ఇండిజినస్ మ్యాన్ ఆఫ్ ది హోల్‌" మరణం అతి పెద్ద నష్టంగా నిపుణులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: