వైరల్ : గుడ్డు నుంచి బయటకు వస్తూనే.. పడగ విప్పి బుస కొట్టిన పాము?

praveen
సాధారణంగా నాగు పాములు అంటే ప్రతి ఒక్కరు భయపడిపోతుంటారు. నాగుపాము ఎక్కడైనా కనిపించింది అంటే చాలు అటు వైపు వెళ్లడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఒకవేళ నాగు పాము పడగ విప్పి మన వైపు చూసింది అంటే వణికి పోతూ ఉంటారు అని చెప్పాలి. సాధారణంగా  నాగు పాము పడగ విప్పుతుంది అన్న విషయం అందరికీ తెలుసు. కానీ తల్లి పెట్టిన గుడ్డు లో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏ సమయంలో నాగు పాము పడగ విప్పుతుంది అన్న విషయంపై మాత్రం ఇప్పటి వరకు ఎంతోమంది క్లారిటీ లేదు అనే చెప్పాలి.

 ఈ క్రమంలోనే నాగుపాముల కు సంబంధించిన వీడియోలు ఏమైనా సోషల్ మీడియాలోకి వచ్చాయంటే చాలు అది క్షణాల్లో వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. నాగు పాముల కదలికలు అవి కాటు వేసే విధానం గురించి వీడియోలో స్పష్టంగా చూస్తూ ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్య పోతూ ఉంటారు అని చెప్పాలి. కొన్ని సార్లు ఏకంగా నాగు పాములు గుడ్లు లో నుంచి బయటికి రావడం లాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి.

 గుడ్డు లో నుంచి బయటికి వచ్చిన బేబీ కోబ్రా గుడ్డు నుంచి బయటకు వచ్చిందో లేదో పడగ విప్పి బుసలు కొడుతూ ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాలి.. ఇక ఇది చూసిన తర్వాత నాగుపాములు పుట్టగానే పడగవిప్పటం మొదలుపెడతాయి అన్న క్లారిటీ అందరికీ వచ్చేస్తూ ఉంది. ఇక నాగుపాము అప్పుడే పుట్టినప్పటికి కూడా ప్రమాదకరమైనది అంటూ ఎంతోమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. మరీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: