మీసాలు తిప్పుతున్న మహిళ.. నెట్టింట వైరల్!

Purushottham Vinay
మీసాలను మగాళ్లు మాత్రమే తిప్పుతారా..? వాళ్లకేం తక్కువ కానంటూ ఓ స్త్రీ మీసాలను మేలేసి మరి తిప్పుతోంది. నా మీసాలు..నా ఇష్టం.. ఇందులో వేరొకరి ప్రమేయం అవసరం లేదంటూ ఆమె తెగేసి మరి చెబుతోంది. ఇక కేరళకు చెందిన ఓ మహిళ ఫొటో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్‌గా మారింది. అచ్చం మగాళ్ల లాగా మీసాలను మెలితిప్పి.. నా ఇష్టం అని ఆమె పేర్కొంటుంది. అయితే.. ఆమెను నెటిజన్లు చాలామంది కూడా ప్రశంసిస్తుండగా.. మరికొంతమంది అయితే ట్రోల్ చేస్తున్నారు. ఈ సమయంలో ఆమె చెప్పిన మాటాలు విని అందరూ కూడా సెల్యూట్ చేస్తున్నారు. సాధారణంగా కొంతమంది యువతుల ముఖం మీద ఇంకా గడ్డం మీద వెంట్రుకలు బాగా పెరుగుతాయి. ఇక వాటిని తొలగించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వీరికి భిన్నంగా.. కేరళ మహిళ షైజా తన మూతి మీద పెరిగిన మీసాలను ఎంతో ఇష్టంతో బాగా పెంచుకుంటోంది.కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన 35 ఏళ్ల షైజా తన మీసాల కారణంగా ఇటీవల వైరల్ అవుతూ వార్తల్లో నిలిచింది. ఇక ఈ వ్యవహారాన్ని కొందరు వ్యతిరేకించగా, మరికొందరు ఆమెకు మద్దతుగా నిలవడంతోపాటు ప్రశంసిస్తున్నారు. ఇంకా దీని గురించి షైజా మాట్లాడుతూ.. తాను మీసాలను పెంచుకోవాలనుకుంటున్నానని, వాటిని తీసివేయడం తనకు అస్సలు ఇష్టం లేదని స్పష్టం చేసింది. ఈ మీసం తనకు గర్వకారణమని ఆమె పేర్కొంది.


''మీసం వల్ల నన్ను ఎగతాళి చేస్తారు.. పురుషులకు మీసాలు ఉంటాయి కానీ మహిళకు మీసాలు ఎందుకు ఉంటాయంటూ ప్రశ్నిస్తారు..ఇది నాకు నచ్చింది.. అందుకే నేను మీసం ఉంచుకున్నా.. అసలు నేనేందుకు మీసం ఉంచుకోకూడదు'' అని షౌజా పేర్కొంది.ప్రపంచం తన గురించి ఏమనుకున్నా కానీ తాను అస్సలు పట్టించుకోనని.. మీసాలు లేకుండా జీవితాన్ని ఊహించుకోలేనని ఇక షైజా తెలిపింది. కరోనా వైరస్ సమయంలోనూ తాను మీసాలను కప్పి ఉంచే మాస్క్ పెట్టుకోవడాన్ని చాలా ఇబ్బందిగా భావించానని పేర్కొంది. కాగా.. షైజా గత పదేళ్లలో పలు అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొన్నట్లు చెప్పింది.ఆమెకు ఆరుసార్లు ఆపరేషన్లు జరిగాయని.. ఆ ఆపరేషన్ కోసం వెళ్లిన ప్రతీసారి ఇక వెళ్లాల్సిన అవసరం లేదని నమ్మెదాన్నంటూ పేర్కొంది.అయితే ఈ షైజా ప్రపంచంలోనే మీసాలు ఉన్న మొదటి మహిళ కాదు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. 2016 వ సంవత్సరంలో బాడీ పాజిటివిటీ ప్రచారకర్త హర్నామ్ కౌర్ గుబురు గడ్డం కలిగిన అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: