వామ్మో.. ఈ జీవి వేటాడే వేగం ముందు.. చిరుత కూడా పని చేయదు?

praveen
ఈ ప్రకృతిలో ఎన్నో రకాల జీవులు ఉన్నాయి . కానీ మనుషులకు తెలిసింది మాత్రం కొన్ని రకాల జీవుల గురించే. కానీ సోషల్ మీడియా పుణ్యమా అని ఎన్నో రకాల చిత్రవిచిత్రమైన జీవులు అప్పుడప్పుడు తెరమీదికి వస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అంతేకాదు కొన్ని రకాల జీవులు తమ ఆహారాన్ని సంపాదించడం కోసం వేటాడే విధానం కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం అడవుల్లో ఉండే జీవులలో వేగంగా వేటాడే  జీవి ఏది అంటే అందరూ చిరుతపులి అని చెబుతూ ఉంటారు.

 ఎందుకంటే మాటువేసి మెరుపువేగంతో దాడిచేసి ఏకంగా టార్గెట్ ను వేటాడటం చేస్తూ ఉంటుంది చిరుతపులి. అందుకే వేగంగా వేటాడే జీవి లో చిరుతపులి ముందు స్థానంలో ఉంటుందని చెబుతారు. కానీ ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూసిన తర్వాత మాత్రం ఇక్కడ ఒక జీవి వేటాడే వేగం ముందు అటు చిరుతపులి కూడా పని చేయలేదేమో అని అనిపిస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో ఎప్పటిలాగానే ఒక ఆసక్తికర వీడియో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోలో కనిపించే జీవి ఏకంగా బుల్లెట్ వేగంతో ఒక కీటకాన్ని వేటాడుతుంది.

 తుపాకీ నుండి బయటికొచ్చిన బుల్లెట్ కేవలం ఒక వ్యక్తికి తగిలినప్పుడు కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా అంతే వేగంతో వేటాడి ఒక పురుగును గుటుక్కున మింగేస్తుంది చిత్రమైన జీవి. అయితే కప్పు ఆకారంలో ఉన్న జీవి కాస్త వింతగానే కనిపిస్తుంది అని చెప్పాలి. కప్పతో పోల్చి చూస్తే కళ్ళు చాలా పెద్ద గానే ఉన్నాయి. పాదాలు ఎండిన ఆకులలా కనిపిస్తూ ఉన్నాయి. ఇక వీటి పేరు మలయాన్ కొమ్ముల కప్ప అని అంటారట. కప్పల  వర్షారణ్యాలలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ట్విట్టర్ లో  వైరల్ గా మారిపోయిన ఈ వీడియోని మీరు కూడా ఒకసారి చెక్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: