50% డిస్కౌంట్.. షాపింగ్ మాల్ లోకి దూసుకొచ్చిన జనం.. చూస్తే అవాక్కే?

praveen
సాధారణంగా షాపింగ్ చేసే సమయంలో మంచి దుస్తులు ఎక్కడ ఉంటాయి అన్న విషయంతో పాటు ఏదైనా షాపులో డిస్కౌంట్లు ఇస్తున్నారా లేదా అన్న విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటూ ఉంటారు.  అన్ని ఆలోచించిన తర్వాతే ఇక షాపింగ్ చేయడం లాంటివి  చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆషాడంలో అయితే ఎన్నో షాపింగ్ మాల్స్ వినూత్నమైన ఆఫర్లు ప్రకటిస్తూ  అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే  ఎంతోమంది ఆషాడం లో ఉన్న ఆఫర్ లను క్యాష్ చేసుకుంటూ భారీగా షాపింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అందుకే ఆషాడంలో ఏ షాపింగ్ మాల్కు వెళ్లిన అటు జనాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉంటారు..

 అయితే ఒకవేళ ఇక ఏ వస్తువు కొనుగోలు చేసిన అటు 50% భారీ డిస్కౌంట్ అంటూ ప్రకటించారు అంటే చాలు ఆ షాప్ నిండా కస్టమర్లు  ఎంతలా కిక్కిరిసి పోతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ ఇలాంటి ఆఫర్లు ప్రకటించగా కస్టమర్లు దండోపతండాలుగా తరలి వచ్చారు. దీంతో షాపింగ్ మాల్ యాజమాన్యానికి ఊహించని రీతిలో చేదు అనుభవం ఎదురైంది అని చెప్పాలి. ఒకానొక సమయంలో ఇక షాపింగ్ మాల్ లోకి దూసుకు వచ్చిన కస్టమర్లను కంట్రోల్ చేయ లేక సిబ్బంది సైతం చేతులెత్తేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. కేరళలోని తిరువనంతపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 తిరువనంతపురం లో లాలూ షాపింగ్ మాల్ లో ఉంది. అందులో 50 శాతం డిస్కౌంట్ ప్రకటించారు యాజమాన్యం. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల జనాలు భారీగా ఆ షాపింగ్ మాల్ కి క్యూ కట్టారు. ఎంతలా అంటే ఎక్కడ చూసినా కిక్కిరిసిపోయిన జనం కనిపించారు అనే చెప్పాలి. దీంతో షాపింగ్ మాల్ సిబ్బంది వచ్చిన కస్టమర్లను కంట్రోల్ చేయలేక చేతులెత్తేశారు. ఈ ఘటనకు సంబంధించి ఒక వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్  లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది.. ఇది చూసిన తర్వాత 50% డిస్కౌంట్ కాదు  ఫ్రీ గా ఇవ్వడం లేదు కదా అంటూ వీడియో కి  కామెంట్ చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: