వైరల్ : బాబోయ్.. చేపలు ఇలా కూడా పట్టొచ్చా?

praveen
సాధారణంగా జాలర్లు చేపల ఎలా పెడతారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎంతో కష్టపడి వలలు వేయడం ఈ వలను ఒడ్డుకు లాక్కొచ్చి అందులోనుంచి చేపలు తీయడం లాంటివి చేస్తుంటారు. మరికొంతమంది గాలం వేసి చేపలను  పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు వరకు చేపలను ఈ రెండు రకాలుగా పడతారు అన్న విషయం దాదాపు అందరికీ తెలుసు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎంతోమంది వినూత్నంగా ఆలోచిస్తూ సరికొత్తగా  చేపలు పడుతున్న వీడియోలు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

 అయితే ఇలాంటి వినూత్నమైన ఆలోచన తో చేపలు పట్టాలని అసలు ఎలా అనిపించిందబ్బా అని కొన్ని వీడియోలు చూసినప్పుడు ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంటుంది. ఇప్పుడు ఇలా అందరినీ ఆశ్చర్య పరిచే ఒక వీడియో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎంతో కష్టపడి చెరువులో వలలు వేసి చేపలు పట్టడమే కాదు కాస్త తెలివిగా ఆలోచిస్తే సులభంగానే ఊహించని రీతిలో ఎక్కువ చేపలను పట్టొచ్చు అని ఇక్కడ ఒక వ్యక్తి నిరూపించాడు. ఇంతకీ సదరు వ్యక్తి ఏం చేశాడు అంటే.. డ్యాంలో నీళ్లు నిండి కిందికి వచ్చేస్తూ ఉన్నాయి.  అయితే నీటి ప్రవాహానికి చేపలు ఎదురు ఈదుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 ఇక చేపలు ఇలా ఎదురు ఈదుతాయి  అన్న విషయాన్ని తెలుసుకున్న సదరు వ్యక్తి వినూత్నమైన ప్లాన్ వేశాడు. నీటి ప్రవాహానికి కింది భాగంలో కొన్ని బుట్టలు ఏర్పాటు చేశాడు. దీంతో ఇక ఆ ప్రవాహానికి ఎదురుగా ఈదుతున్న చేపలు చివరికి సరిగా బుట్టలో వచ్చి పడిపోతున్నాయి. దీంతో ఎలాంటి కష్టం లేకుండానే సదరు వ్యక్తి చేపలు పట్ట గలుగుతున్నాడు అని చెప్పాలి. ఇక ఈ వ్యక్తి తెలివి చూసి ప్రస్తుత నెటిజన్లు అందరూ ఫిదా అవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: