వేడి వేడి షవర్మా టేస్ట్ లో బెస్ట్..ప్రాణాలు తీయ్యడంలో ఫస్ట్..

Satvika
కొన్ని ఆహార పదార్ధాలు చూడగానే నోరు ఊరిపోతుంది. అయితే తింటే మాత్రం దూల తీరిపోతుంది..అవును అండీ ఈరోజుల్లో ఎలాంటి ఆహార పదార్థాలను అయిన ఫ్రెష్ గా చెయ్యడం లేదు..స్టోర్ చేసినవే దొరుకుతున్నాయి.అందులో షవర్మా కూడా ఒకటి..న్యూ ట్రెండ్ ఫాస్ట్ ఫుడ్ గా మారిన షవర్మా తింటే భూమిపై నూకలు చెల్లినట్లేనా? కేరళలో డేంజర్ బెల్స్ మోగించి.. చెన్నై లో బ్యాన్ వరకు దారితీసిన ఈ విదేశీ ఫుడ్.. మనలన్నేం చేయబోతోంది?? ఇలాంటి చర్చ ఇప్పుడు చాలా హాట్‌ హాట్‌ గా సాగుతోంది. మరోవైపు షవర్మా తిని ఆనారోగ్యం పాలైన ఘటనల్లో కొందరు మరణించడం… మరింత బెంబేలెత్తిస్తోంది..

ఇటీవల కాలంలో కేరళలో 16 ఏళ్ల బాలిక ప్రాణాలు తీసింది. దీంతో తమిళనాడు అప్రమత్తమై ఒక ప్రాంతంలో ఏకంగా షవర్మా అమ్మకాలను నిషేధించింది. ఈ పరిస్థితుల మధ్య మన పక్క రాష్ట్రాలుగా తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌ లల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో అత్యధికంగా షవర్మా అమ్మకాలు సాగుతున్న హైదరాబాద్ లో మరింత చర్చసాగుతోంది..గల్లీ గల్లీకి ఒక షవర్మా సెంటర్ ఉంటుంది.షవర్మా మంచి ఫుడ్. అయినా ఎక్కడ తింటున్నాం? అది ఏ పరిస్థితుల్లో ఉంది? ఎలాంటి చికెన్ ఉపయోగిస్తున్నారు? ఎలాంటి ఇంగ్రియెన్స్ వాడారు? అందులో వేసే మైనోజ్ వంటి పదార్థాలు ఎలా ఉన్నాయి వంటి వాటిని గమనించాలంటున్నారు ఆరోగ్య నిపుణులు..

రోడ్ల పక్కన దుమ్మూధూళీ వంటి వాటి మధ్య మాంసాహారం ఇలా గంటల తరబడి ఉంచి అమ్మకాలు సాగిస్తే, కచ్చితంగా కలుషితం అవుతుందని.. దీని ద్వారా ఈకోలీ, సాల్మనెల్లా వంటి బ్యాక్టీరియాల ద్వారా రోగాలే కాదు.. చివరికి ప్రాణాలు తీసే పరిస్థితులు ఖచ్చితంగా ఏర్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఇకపోతే షవర్మా లాంటి స్ట్రీట్ ఫుడ్స్ లో బ్యాక్టీరియా ఎక్కువ మార్పులు చెంది, అది ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాదు. షవర్మా అందంగా కనిపించడానికి కొన్ని చోట్ల ఉపయోగించే కెమికల్స్..రంగులు అనేక రోగాలకు కారణమవుతుంది..అందుకే శుభ్రమైన ప్రాంతాలలో తినడం బెస్ట్.. ఇన్నీ చెప్పిన తర్వాత కూడా వాటిని అతిగా తింటే ఎవరూ ఏం చెయ్యలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: