ఒకరితో ఎంగేజ్మెంట్..మరొకరితో పెళ్ళి..బండారం బయట పడటంతో..

Satvika
ఈరోజుల్లో ఆడవాళ్ళు మహా ముదురుల్లు అవుతున్నారు.మగాడికి ఆలోచించే టైం కూడా లేకుండా దారుణాలు చేస్తున్నారు.. ఒకరితో ఉంటూనే శారీరక సుఖం కోసం, లేదా డబ్బుల కోసం మరోకరిని వలలో వేసుకుంటూన్నారు. ఇప్పుడు మరో మోసం వెలుగులోకి వచ్చింది.పెళ్లి పేరుతో వంచించాడని, లక్షలాది రూపాయలు తీసుకొని పెళ్లి చేసుకొని. మోసం చేశాడంటూ తరచుగా మహిళలు ఫిర్యాదు చేయడం చూస్తుంటాం. అందుకు భిన్నంగా ఓ యువతిపై బాధితుడు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అమ్మాయిలు మోసగిస్తున్న కేసులు అడపాదడపా కనిపిస్తున్నాయి. అలాంటిదే ఈ కేసు కూడా. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...ఓ యువకుడు గుంటూరులో మోటో కంట్రోలర్ మెకానిక్ గా పనిచేస్తున్నాను. నా తండ్రి పోలియోతో, తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు. నేను వారికి ఒక్కడినే కుమారుడిని. రెవెన్యూశాఖలోని ఓ విశ్రాంత ఉద్యోగి నాకు పరిచయమయ్యారు. అలా వారు మా జిల్లా లోని ఓ విఆర్వో కుమార్తెతో వివాహం కుదిర్చారు. ఆ అమ్మాయికితండ్రి లేరని తాను కట్నం ఇచ్చుకోలేని తల్లి చెప్పడంతో పైసా కట్నం లేకుండా పెళ్లికి అంగీకరించాం. ఫిబ్రవరిలో వివాహం అయ్యింది. పెళ్లి సమయంలో అమ్మాయికి రూ. రెండు లక్షల ఆభరణాలు చేయించాం. మా ఊరులో రూ. ఆరు లక్షలతో రిసెప్షన్ చేశాం

కానీ, అమ్మాయి కాపురం చెయ్యకుండా తన తల్లితో పుట్టింటికి వెళ్ళింది.నెలల తరబడి ఆమె పుట్టింటి నుంచి రావడం లేదు. మా పెద్దలు వెళ్లి అడిగితే గుంటూరులో ఇల్లు అద్దెకి తీసుకోమన్నారు. అలాగే చేశాం. అయితే, అక్కడ కూడా ఒకరోజు ఉండి తనను తాకవద్దంటూ రెండో రోజు పుట్టింటికి వెళ్లిపోయింది. గట్టిగా నిలదీయడంతో కట్నం ఇవ్వమంటున్నారు అని మా పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.10 లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు..మా అత్త వీఆర్వోగా పనిచేసిన గ్రామంలో నిరుడు ఓ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగితో యువతికి నిశ్చితార్థం చేశారట. ఆ విషయం దాచిపెట్టి మాతో వివాహం అంటూ.. తతంగం నడిపారు. మరొకరితో పెళ్లి తంతు నడుపుతూ నా అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు అనిపిస్తుంది..మమ్మల్ని నమ్మించి మోసం చేసిన తల్లి కూతుర్ల పై కేసు పెట్టి మాకు న్యాయం చేయమని కోరాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: