రోజూ మ్యాగీ పెడుతున్న భార్య..భర్త పరిస్థితి ఇదే..!

Satvika
చిటికెలో తయారయ్యె వంట అంటే అందరు మ్యాగీ పేరు చెబుతున్నారు.. పిల్లలు,పెద్దలు అందరు ఇష్టంగా తింటారు.వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకుని తినేయొచ్చు. ముఖ్యంగా మ్యాగీ నూడిల్స్ తయారు చేసుకోవడం ఇంకా సులభం.అప్పుడప్పుడూ అయితే ఫర్వాలేదు కానీ, రోజూ నూడిల్సే తినాలి అంటే మాత్రం ఎవరికైనా కష్టమే. బళ్లారికి చెందిన ఒక వ్యక్తికి అతడి భార్య రోజూ మ్యాగీ నూడిల్సే చేసి పెడుతుండేది. రోజూ నూడిల్స్ తినీ తినీ విసుగొచ్చిన అతను విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. ఈ విషయాన్ని కర్ణాటకలోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ కోర్ట్ జడ్జ్ ఎమ్.ఎల్.రఘునాథ్ ఇటీవల చర్చించారు.

రోజురోజుకూ విడాకుల సంఖ్య పెరిగిపోతుండడం తో ఆందోళన వ్యక్తం చేసిన ఆయన చిన్న చిన్న విషయాలకు కూడా సర్దుకోలేక చాలా మంది విడాకులు తీసుకుంటున్నారని అన్నారు. గతంలో తను బళ్లారి జిల్లా కోర్టు లో జడ్జిగా పనిచేసినప్పుడు వచ్చిన ఒక విడాకుల కేసు గురించి వివరించారు. బళ్లారి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి తన భార్యకు మ్యాగీ తప్ప ఇంకేం వంట చేయడం రాదని, అందువల్ల ఆమె నుంచి విడాకులు ఇప్పించాలని కోర్టు మెట్లు ఎక్కాడు.ఇది వినడానికి వింతగా ఉన్నా కూడా అక్షరాల నిజం అనే చెప్పాలి..ఇలా చెస్తె ఎవరికైనా కోపం రావడం సహజం.

నిజంగానే అతడి భార్యకు వంట చేయడం రాదు. ఎప్పుడూ మ్యాగీ నూడిల్స్ మాత్రమే చేసేది. షాపింగ్‌ కు వెళ్తే నూడిల్స్ ప్యాకెట్లు మాత్రమే కొనుక్కొచ్చేది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్.. ఇలా అన్నిసార్లూ మ్యాగీ నూడిల్సే చేసిపెట్టడం తో విసుగొచ్చిన భర్త విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడని చెప్పారు. కోర్టు నియమావళి ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ, ఇద్దరి మధ్య రాజీ కుదరలేదని, ఇద్దరూ పరస్పర అంగీకారం తో విడాకులు తీసుకున్నారని చెప్పారు..అది పరిస్థితి.. వంట రాకుంటే జీవితం పెంట అవ్వడం ఖాయం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: