సైనికులకు చుక్కలు చూపించిన మేక..ఏకంగా 40 మందికి టెర్రర్..

Satvika
గత కొన్ని నెలలుగా రష్యా- ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే.. యుద్ధంలో దేశాన్ని మరుభూమిగా మార్చేస్తోంది. రష్యా సైనికులు బాంబుల తో.. క్షిపణుల తో యుక్రెయిన్ పై స్వైరవిహారం చేస్తున్నారు. రష్యా ఆర్మీ అంటే ఎంత బలమైనదో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. కానీ అంతటి గొప్ప సైనికుల ను యుక్రెయిన్ లో ఓ 'మేక' వణించేసింది. రష్యా సైనికులకు చుక్కలు చూపించింది ఓ మేక. ఒకరు కాదు ఇద్దరు కాదు ఓ మేక చేసిన పనికి 40మందికి పైగా రష్యా సైనికులు గాయాలపాలయ్యారు.

ఓ మేక రష్యా సైనికుల ను వణికించిందని.. 40 మందికి పైగా గాయపడటానికి కారణమైందని యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ అధికారులే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంతకీ ఓ సాధారణ మేక చేసిన పనికి రష్యా సైనికులు ఎందుకు వణికిపోయారు. ఎందుకు గాయాల పాలయ్యారు. కిన్ స్కీ రోజ్డొరీ గ్రామంలో ని ఓ ఆస్పత్రి సమీపం లో రష్యా సైనికులు బూబీ ట్రాప్ లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. గ్రనేడ్లను నేల లో వరుసగా అమర్చి వాటికి తీగల ను అనుసంధానం చేసి పెడుతున్నారు.

ఎవరైనా అటు వైపుగా వచ్చినప్పుడు కాలికి ఆ తీగలు తాకి.. గ్రనేడ్లు పేలిపోతాయి.. అలా సైనికులు అమరుస్తున్న నేపథ్యం లో ఓ మేకల మంద నుంచి ఓ మేక అటుగా వచ్చింది. మొదట ఒక ట్రాప్ దాని కాలికి తగిలి గ్రనేడ్ పేలింది. దీనితో భయపడిన మేక వేగంగా పరుగెత్తడంతో వరుసగా ఒకదాని తర్వాత మరోటి గ్రనేడ్ లన్నీ పేలిపోయాయి. వాటిని అమర్చుతూ వెళ్తున్న రష్యా సైనికులు కకావికలంగా పరుగులు పెట్టారు. ఈ పేలుళ్లలో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని.. కొందరు చనిపోయి ఉంటారని యుక్రెయిన్ నిఘా వర్గాలు తెలిపాయి.. మేక ఎలా వుందో మాత్రం తెలియలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: