ఆనియన్ రింగ్స్ ఆర్డర్ చేశాడు..వచ్చింది చూసి షాక్..

Satvika
గత కొన్ని రోజులుగా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ మీద రకరకాల రూమర్స్ వస్తున్నాయి.. వాటిని కొంత మంది లైట్ తీసుకుంటే, మరి కొంతమంది మాత్రం ఫుడ్ ఆర్డర్‌ లు పెట్టడం మానుకున్నారు..కరోనా సమయంలో ఈ ఫుడ్ డెలివరీ సంస్థలు ఎంతో ఆసరాగా ఉన్నాయి..కానీ కస్టమర్లను పెంచుతుంది.. అప్పుడు ఒకలా వున్న సర్వీసులు ఇప్పుడు మాత్రం జనాలకు షాక్ ఇస్తున్నాయి.. ఒకటి అనుకోని ఫుడ్ ఆర్డర్ చెస్తె మరొకటి వస్తున్నాయి. దీంతో జనాలకు నమ్మకం పోయింది.ఇష్టమైన స్నాక్స్ కోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాడు. కొది సమయం తర్వాత డెలివరీ బాయ్.. వచ్చి పార్శల్ ఇచ్చేసి వెళ్లిపోయాడు.సదరు వ్యక్తి ఎంతో ఆశగా పార్శల్‌ను ఓపెన్ చేశాడు. తీరా అందులో కనిపించిన దృశ్యం చూసి కంగుతిన్నాడు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్నా షాకింగ్ అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లతో పంచుకున్నాడు. దీంతో స్పందిస్తున్న నెటిజనం.. ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.వివరాల్లొకి వెళితే..ఢిల్లీకి చెందిన ఉబైడు అనే యువకుడికి ఆనియన్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. వాటిని తినాలనిపించిన ప్రతిసారి.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకునేవాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే.. తాజాగా ఫుడ్‌ డెలివరీ యాప్‌లో ఆరు ఆనియన్ రింగ్ పీసులు కావాలని ఆర్డర్ పెట్టాడు. కొద్ది నిమిషాల తర్వాత డెలివరీ బాయ్.. ఫుడ్ పార్శల్ తెచ్చిచాడు. ఆ తర్వాత తనకు ఎంతో ఇష్టమైన ఆనియన్ రింగ్స్‌ తినేందుకు పార్శల్‌ను ఓపెన్ చేశాడు.ఆ పార్శల్‌లో ఆనియన్ రింగ్స్ బదులుగా పచ్చి ఆనియన్ ముక్కలు ఉండటంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. అనంతరం తాను ఎదుర్కొన్న చేదు అనుభాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియాలో వెల్లడించాడు. అతడు చేసిన పోస్ట్ వైరల్ కావడంతో.. నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. 'పచ్చి ఆనియన్ ముక్కలతోపాటు, బేషన్, ఆయిల్ కూడా పంపిచారేమో కవర్‌లో సరిగా చూడండి' అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. గతంలో కొద్ది రోజుల క్రితం సుమిత్ అనే వ్యక్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. కాఫీ కోసం జొమాటోలో ఆర్డర్ చేయగా.. చికెన్ ముక్క ఉన్న కాఫీ అతడికి డెలివరీ అయింది..ఇంక ఏది వస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: