ఆకాశంలో ఎగురుతున్న ఓడ..జనాలు ఏమన్నారంటే?

Satvika
ఓడలు నీటిలో ఉండాలి..విమానం అనేది గాల్లో ఎగరాలి..కానీ ఓడ గాల్లో ఎగరడం ఎప్పుడైనా చూశారా?  అదెలా సాధ్యం అనే సందేహం అందరికి వస్తుంది కదూ..కానీ మీరు విన్నది నిజమే..ఓ ఓడ గాల్లో ఎగిరిందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రజలు అది నిజమని అంటున్నారు.అసలు ఆ గాల్లో ఓడ సంగతి ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..ఇంగ్లండ్‌లోని కార్న్‌వాల్‌లోని కవరాక్ అనే చిన్న గ్రామం సమీపంలో పక్కనే ఉన్న సముద్రంలో ఓ పెద్ద ఓడ గాల్లో ఎగరడం గమనించారు. దీంతో ఈ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు..


ఓ ప్రముఖ ఫోటో గ్రాఫర్ అక్కడ ఆ దృశ్యాన్ని తన కెమరాలో బంధించాడు.ఇది చూసిన వారంతా ఆ షిప్ నిజంగానే ఎగురుతుంది అని అనుకున్నారు. కానీ ఇది నిజం కాదని తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోతున్నారు జనాలు. ఆప్టికల్ భ్రమల కారణంగా సముద్రం మీద ఉన్న ఈ ఓడ చూసేవారికి గాల్లో ఎగురుతున్నట్టు కనిపిస్తుంది. సముద్రం మరియు ఆకాశం దూరం నుంచి చూస్తే కలుస్తున్నట్టు కనిపిస్తాయని మన అందరికి తెలిసిందే. అలాగే వాటి రంగు కూడా ఒకేలా ఉంటుంది. దీంతో సముద్రంలో ఎక్కడో ఉన్న ఓ షిప్ ఆకాశానికి సముద్రానికి మధ్య గాలిలో ఉన్నట్టు చూసేవారికి కనిపిస్తుంది.


ఆకాశం, సముద్రం ఒకేలా ఉండటంతో అది కాస్త అలా ఆకాశంలో ఉన్నట్లు అనిపిస్తుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో అంత తొందరగా గ్రహించటం చాలా కష్టం. అది నిజమేనా కాదా అని మళ్ళీ మళ్ళీ చూస్తాము. వీటిని ఆప్టికల్ భ్రమలు అంటారు. వీటి వల్ల నిజమైన దాన్ని గురించడం కొంచెం కష్టమవుతుంది. అక్కడి ప్రజలు పలువురు దీన్ని సోషల్ మీడియాలలో పోస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో దీన్ని చూసిన వారంతా ఆ షిప్ నిజంగానే ఎగురుతుంది అని అనుకుంటున్నారు.ఇంగ్లాండ్ కార్న్‌వాల్‌లో ఇలాంటివి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా ఒక పెద్ద పడవ ఇలాగే ఆకాశంలో తేలుతున్నట్లు కనిపించింది.ఆ తర్వాత ఒక భ్రమ అని సరిపెట్టుకున్నారు.ఏది ఏమైనా కూడా ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: