ఈ పెన్ను రేటు అక్షరాల 11 లక్షలు..స్పెషల్ ఏంటంటే?

Satvika
మనుషులు పెన్నులను ఎందుకు వాడతారు ఏదైనా రాసుకోవడానికి, అలాగే పిల్లలు అయితే చదువుకు సంబంధించిన విషయాలను పుస్తకాల్లో రాస్తారు.ఆ పెన్నుల ఖరీదు 5 లేదా 10 రూపాయలు ఉండటం మనం చూసే ఉంటాము..అంతకన్నా ఎక్కువ అంటే 100 లేక 200 లు ఉంటుంది. కానీ, వేలు, లక్షలు అయితే ఉండదు..లక్ష రూపాయలు  పెన్ను కోసం పేట్టేవాడు మూర్ఖుడు అయ్యి ఉంటాడు.ఎంత డబ్బులు ఉన్న వాడు అయినా కూడా ఇలా లక్షలు పోసి కొన్న పెన్నును జేబులో పెట్టుకొని తిరగడు..


మ్యాటర్ లోకి వస్తే..రాజస్థాన్‌లోని జైపూర్‌ అంతర్జాతీయ జమ్ జ్యువెలరీ షో ఈసారి ఎంతో ప్రత్యేకతను అందుకుంది.ఎగ్జిబిషన్‌లో రూ.11 లక్షల విలువైన పెన్ను ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఈ పెన్ను చూడటానికి ఒక వీణ ఆకారంలో ఉంటుంది.. అయితే ఈ పెన్ను 22 క్యారెట్ల బంగారంతో మార్గనైట్ రాయి, బర్మీస్ టూర్మాలిన్స్, డైమండ్, ఎమరాల్డ్ పూసలతో తీర్చిదిద్దారు. ఇందులో నెమలి ఆకారాన్ని జాతి రత్నాలతో తయారు చేశారు.. ఆకుపచ్చని, రోజా కలర్, తెల్లని రాళ్ళతో తయారు చేశారు.ఇది చూడటానికి చాలా అందంగా ఉంది. దీన్ని ఎలా తయారు చేశారు అనేది ఆసక్తిగా మారింది..


ఈ నెల 12 వరకు జరిగిన ఎగ్జిబిషన్‌లో 48 దేశాల నుంచి 8000 మందికి పైగా కొనుగోలుదారులు వచ్చారు. 500 మందికి పైగా ఎగ్జిబిటర్లు ఇందులో  పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ షోలో ఖరీదైన నగలను ప్రదర్శించారు. ఇందులో కొలంబియా ఎమరాల్డ్ ఆభరణాలు చూపరులను బాగా ఆకట్టుకున్నాయి.అంతే కాదు 11 లక్షల విలువ చేసే బంగారపు పెన్ను కూడా అందరినీ ఆకర్షించింది. అంతేకాదు.. ఈ పెన్నును ఎవరి కొంటారు అనే అంశం చర్చనీయాంశంగా మారింది. అన్నీ లక్షలు పెట్టి పాకెట్ లో పెట్టుకుంటారా అనే సందెహాలు కూడా కలగడం సహజం. మొత్తానికి ఇది నెట్టింట చక్కర్లు కోడుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: