వామ్మో.. పెళ్ళికి ఇలాంటి గిఫ్ట్స్ కూడా ఇస్తారా?

Satvika
సాదారణంగా వివాహ శుభకార్యాలకు ఏదైనా బహుమతి ఇవ్వడం సాదారణం.. అందులో గిఫ్ట్ అంటే ఎదో ఫోటో ఫ్రెమ్, లేదా గిన్నొ లేదా గ్లాస్ ఇవ్వడం చూసి ఉంటాము..అయితే ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్లకు మాత్రం వింత వింత గిఫ్ట్ లను ఇస్తున్నారు.. వాటిని చూడగానే అందరు నవ్వడం మాత్రం ఖాయం అని చెప్పాలి.. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాలలో కరొనా విజ్రుంభిస్తున్న నేపథ్యం లో జరిగిన పెళ్లిళ్లకు మాత్రం అందరు మాస్కులతో పాటు, స్వీయ జాగ్రత్రకు అవసరమైన కిట్ లను బహుమతి గా ఇస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే.


ఆ తర్వాత పరిస్థితులకు అనుకూలంగా ఉల్లి గడ్డల ధరలు భారీగా పెరగడంతో బంగారంకు బదులుగా ఉల్లిని గిఫ్ట్ గా ఇచ్చారు. ఇలా ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో గిఫ్ట్ లు ఇచ్చి సోషల్ మీడియాలో రచ్చ చేసిన సంగతి తెలిసిందే.. వాటికి మంచి క్రేజ్ కూడా లభించింది. కాగా, ఇప్పుడు మాత్రం మరో ఘటన వెలుగు చూసింది.అసలు ఎందుకు అలా చేశారు అనే సందెహాలు రావడం పక్కా..ఇప్పుడు మరోక ఆలోచన కూడా చాలా మందికి రావడంతో కామన్.  ఇప్పుడు అలాంటి వింత ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది..


ప్రస్తుతం సమ్మర్ కావడంతో కరెంట్ కోతలు ఉన్న సంగతి తెలిసిందే..దానిని నుంచి బయట పడటానికి ఓ నూతన వధూవరులకు విసన కర్రలను, కొవ్వొత్తులను గిఫ్ట్ గా ఇచ్చారు. విషయాన్నికొస్తే..విద్యుత్తు కోతల ప్రభావం వివాహ వేడుకల్లోనూ కనిపిస్తోంది. పెనుగంచి ప్రోలుకు చెందిన నల్లపనేని నరేష్, త్రిశంకల వివాహం ఓ కల్యాణ మండపం లో జరిగిన సంగతి తెలిసిందే.కుటుంబ సభ్యులు, బంధువులు వధూ వరులను ఆశీర్వదించి బహుమతులు ఇస్తున్నారు. తెదేపా నాయకుడు, మాజీ సర్పంచి జిల్లేపల్లి సుధీర్ బాబు పెళ్లి కూతురు, కుమారుడికి ఆకర్షణీయమైన కవర్లు కానుకగా ఇచ్చారు.. ఆ కవర్ల లోపల ఏముంది అని ఓపెన్ చేసి షాక్ అయ్యారు..ఒకదానిలో కొవ్వొత్తులు, మరోదానిలో రెండు విసనకర్రలు ఉన్నాయి.. వాటిని చూసిన అందరు నోర్లు వేళ్ళబెట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: