ఈ స్టైల్ దొంగతనాన్ని ఎప్పుడూ చూసి ఉండరు సుమీ..!

Satvika
దొంగతనాలు చేయడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు.. దొంగలు కూడా ఇలా ఉంటారా అన్న విధంగా స్టైల్ గా ఉంటూ..జనాలను మోసం చెస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ఓ వెరైటీ దొంగతనం జరిగింది..అది చూస్తె ఎవరికైనా మతి పోవాల్సిందే.. అవును అండీ.. నిజంగానే ఆ దొంగతనం చాలా వెరైటీగా వుంటుంది. ఓ లేడి చేస్తున్న పనికి ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.. దొంగతనాలకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే వస్తున్నాయి.


అందులో ఓ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.ఓ యువతి చేసిన దొంగతనానికి ఎవరైనా ఆశ్చర్య పడాల్సిందే..ఓ జ్యువెలరీ షాప్‌కి ఓ జంట గిఫ్ట్ బాక్స్ పట్టుకుని వచ్చినట్లు మీరు వీడియో చూడవచ్చు. వాళ్లను చూసినప్పుడు మీకసలు ఎలాంటి డౌట్ రాదు. అంత టిప్ టాప్ గా రెడీ అయ్యి వెళ్లారు. షాప్ కు అలా వెళ్ళగానే వాళ్ళకు ఏమి కావాలని దుకాణ దారుడు అడుగుతాడు. వాళ్ళు ఉంగరాలు బాగా రిచ్ గా వుండాలని చెబుతారు. వాళ్ళు కోరిన విధంగా అతను వాళ్ళకు ఉంగరాలను చూపిస్తాడు.


అది వాళ్లకు నచ్చదు. మరికొన్ని చూపించేందుకు అతడు వెనక్కి తిరగగా.. ఆ మహిళ తాను వెంటపెట్టుకుని తీసుకొచ్చిన గిఫ్ట్ బాక్స్‌లో ఖరీదైన నెక్లెస్ దాచిపెట్టేస్తుంది.. ఈ దొంగతనం మొత్తం షాప్ లోని సిసి కెమరాల్లొ రికార్డ్ అయ్యింది.ఆ వీడియోను చూసిన ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. దాంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వడంతో లక్షల 94 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను వేలాది మంది లైక్ చేశారు. 'క్యా మైండ్ హై బ్రదర్' అని ఒకరు కామెంట్ చెస్తున్నారు. ఇది జరిగి చాలా రోజులు అయిన ఆలస్యంగా బయటకు రావడంతో గ్రేట్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: