వైరల్ : చంకలో చంటి బిడ్డా.. అలాగే వార్తలు చదివిన యాంకర్?

praveen
ఇటీవల కాలం లో మహిళలు ఫుల్ బిజీ అయి పోయారు. ఒక వైపు మహిళా సాధికారత చాటేందుకు   ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్నారు.  అదే సమయం లో కుటుంబ బాధ్యతలను కూడా సమన్వయం చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఇలా ఎప్పుడూ బిజీ బిజీగా మారి పోయారు నేటి రోజుల్లో మహిళలు. సాధారణంగా మహిళల జీవితం లోకి పిల్లలు వచ్చారు అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు వారిని వదిలి విధులకు వెళ్లడం ఎంతో కష్టం గానే ఉంటుంది. ఈ క్రమం లోనే  విధులకు హాజరు అవ్వకుండా ఉండటం లాంటివి చేస్తూ ఉంటారు ఎంతో మంది మహిళలు.

 కానీ అమెరికాకు చెందిన ఒక వార్తా అసలు పని చేసే మహిళా యాంకర్ సరికొత్తగా ప్రయత్నించింది. సాధారణం గా లైవ్ న్యూస్ చదువుతున్న యాంకర్లు సూట్ వేసుకుని ఎలాంటి డిస్టబెన్స్ ఉండకుండా న్యూస్ ప్రజెంట్ చేయడం లాంటివి చూస్తూ ఉంటారూ. కానీ ఇక్కడ ఒక మహిళ మాత్రం ఏకంగా చంకలో చంటి బిడ్డను ఎత్తుకుని చకచకా న్యూస్ చదివేసింది.  ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోయింది.

 అమెరికాకు చెందిన రేబాక షుడ్ మహిళా వార్తా సంస్థలో యాంకర్ గా పనిచేస్తుంది. ఇంటి నుంచి వార్తలకు సంబంధించిన న్యూస్ ప్రెసెంట్ చేస్తూ వస్తోంది. అయితే ఇటీవల సరిగా వాతావరణ న్యూస్ చెబుతున్న సమయంలో మూడు నెలల చిన్నారి నిద్రనుంచి మేలుకుంది. దీంతో ఏకంగా బిడ్డను చంకలో ఎత్తుకొని అలాగే వార్తలను చదవడం కంటిన్యూ  చేయడం మొదలు పెట్టింది. ఇక ఈ విషయాన్ని సదరు యాంకర్ సోషల్ మీడియా వేదికగా చెప్పి వీడియో ని పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. ఇలా కుటుంబ బాధ్యతలు  ఆఫీస్ వర్క్ ను సమన్వయం చేసిన ఆ మహిళకు అందరూ హాట్సాఫ్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: